AP News: మరికాసేపట్లో పెళ్లి.. ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు కళ్లు తేలేసిన వరుడు

తిరుమలలో హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండే తిరుమల క్షేత్రంలో రెండో పెళ్లిని అట్టహాసంగా చేసుకోవాలనుకున్న రాకేష్ అనే యువకుడి నిర్వాకాన్ని మొదటి భార్య బయటపెట్టింది.

AP News: మరికాసేపట్లో పెళ్లి.. ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు కళ్లు తేలేసిన వరుడు
Marriage
Follow us
Raju M P R

| Edited By: Ravi Kiran

Updated on: Aug 09, 2024 | 11:13 AM

తిరుమలలో హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడి రెండో పెళ్లి వివాదం కలకలం రేపింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉండే తిరుమల క్షేత్రంలో రెండో పెళ్లిని అట్టహాసంగా చేసుకోవాలనుకున్న రాకేష్ అనే యువకుడి నిర్వాకాన్ని మొదటి భార్య బయటపెట్టింది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లికి చెందిన గంగవోల్ల రాకేష్ వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం పెండ్యాలకు చెందిన సంధ్యను 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. 2016 ఏప్రిల్ 29న సంధ్యను పెళ్లి చేసుకున్న రాకేష్‌కు ఇప్పుడు 7 ఏళ్ల మాన్వి అనే కూతురు కూడా ఉంది.

2021 నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి. ఇద్దరూ కోర్టు మెట్ల ఎక్కారు. డెమోస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కింద హనుమకొండ కోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే ఈలోపు రాకేష్ రహస్యంగా రెండో పెళ్లికి సిద్ధం కావడంతో మొదటి భార్య ఎంట్రీ ఇచ్చింది. తిరుమలలోని సిద్ధేశ్వరమఠంలో జరుగుతున్న రెండో పెళ్లిని అడ్డుకుంది. గుట్టుచప్పుడు కాకుండా తన భర్త రాకేష్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని తెలిసి తిరుమలకు వచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది మొదటి భార్య సంధ్య.

విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంటున్న భర్త బండారాన్ని బయట పెట్టింది సంధ్య. 7 ఏళ్ల కూతురు మాన్విని వెంటపెట్టుకొని తిరుమలకు వచ్చిన సంధ్య భర్త రెండో పెళ్లి వేడుకలు జరుగుతున్న మఠం వద్దకు చేరుకుంది. సంధ్య ఎంట్రీతో పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన రాకేష్ ఊహించని షాక్‌కు గురయ్యాడు. అక్కడి నుంచి పరారీ కాగా.. సంధ్య తిరుమల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రాకేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

కేసు కోర్టులో ఉండగా విడాకులు ఇచ్చానని.. మరో యువతిని మోసం చేసి భర్త పెళ్లి చేసుకుంటున్నారని మొదటి భార్య సంధ్య ఫిర్యాదులో పేర్కొంది. భర్త ఇంట్లో ఉండేందుకు కోర్టు షెల్టర్ ఆర్డర్ ఇచ్చినా.. కొట్టి తరిమేశారని సంధ్య ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలు ఉన్న భర్త కుటుంబం ఇంట్లోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని సంధ్య ఆరోపిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..