AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj Chopra diet: ఫిట్నెస్ కోసం మన బల్లెం వీరుడు ఏమి తింటాడో తెలుసా..

భారత దేశం జాతీయ క్రీడా హాకీ.. అయితే మన దేశంలో క్రికెట్ కు తప్ప వేరే ఆటలకు సరైన ఆదరణ తక్కువే అని చెప్పవచ్చు. అభినవ్ బింద్రా, సానియా మిర్జా, పీవీ సింధు వంటి ఇతర క్రీడాకారులు తమ నైపుణ్యంతో అప్పుడప్పుడు భారతీయులను ఇతర ఆటలవైపు చూసేలా చేస్తే.. టోక్యో ఒలంపిక్స్ లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనిపించాడు. బల్లెం వీరుడు నీరజ్ కు లభించిన అపారమైన పాపులారిటీ, క్రీడల పట్ల భారతదేశంలో ఇతర క్రీడాకారులు ఉన్నారు.. ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం ఇస్తే తమ శక్తికి మించి రాణించగలరు అనే అభిప్రాయాన్ని రుజువు చేశాడు.

Neeraj Chopra diet: ఫిట్నెస్ కోసం మన బల్లెం వీరుడు ఏమి తింటాడో తెలుసా..
Neeraj Chopra's Diet
Surya Kala
|

Updated on: Aug 09, 2024 | 1:05 PM

Share

భారత దేశం జాతీయ క్రీడా హాకీ.. అయితే మన దేశంలో క్రికెట్ కు తప్ప వేరే ఆటలకు సరైన ఆదరణ తక్కువే అని చెప్పవచ్చు. అభినవ్ బింద్రా, సానియా మిర్జా, పీవీ సింధు వంటి ఇతర క్రీడాకారులు తమ నైపుణ్యంతో అప్పుడప్పుడు భారతీయులను ఇతర ఆటలవైపు చూసేలా చేస్తే.. టోక్యో ఒలంపిక్స్ లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనిపించాడు. బల్లెం వీరుడు నీరజ్ కు లభించిన అపారమైన పాపులారిటీ, క్రీడల పట్ల భారతదేశంలో ఇతర క్రీడాకారులు ఉన్నారు.. ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం ఇస్తే తమ శక్తికి మించి రాణించగలరు అనే అభిప్రాయాన్ని రుజువు చేశాడు. టోక్యో ఒలింపిక్స్ 2020లో ప్రపంచ క్రీడా వేదికపై ట్రాక్, ఫీల్డ్ అథ్లెట్ సాధించిన బంగారు పతకంతో జావెలిన్ వంటి అంతగా తెలియని ఫీల్డ్ క్రీడను భారతీయులను పరిచయం చేసింది.

ఒలింపిక్స్‌లో లేదా ఏదైనా ప్రధాన క్రీడా ఈవెంట్‌లో పతకం గెలవడం అనేది ఒక భారీ విజయం. ఈ మైలురాయిని చేరుకోవడానికి అపారమైన అంకితభావం, స్థిరత్వం అవసరం. కఠినమైన శిక్షణా సెషన్‌లతో పాటు, ఈ టోర్నమెంట్‌లకు ప్రిపేర్ అయ్యే అథ్లెట్లు ఖచ్చితమైన ఆహారాన్ని అనుసరించాలి . జావెలిన్ త్రోయర్లకు ముఖ్యంగా ఆహార క్రమశిక్షణ ముఖ్యం. ఇది సహజంగా వారు రుచికరమైన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. చోప్రా ఒకప్పుడు భోజన ప్రియుడు. అయితే ఇప్పుడు ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకుని ఆహరం తినే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

నీరజ్ చోప్రా డైట్: ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఒక రోజులో ఏమి తింటాడంటే

ఇవి కూడా చదవండి

నీరజ్ చోప్రా 10 శాతం శరీరంలో కొవ్వు శాతాన్ని కావల్సినంత మాత్రమే ఉండేలా చూసుకుంటాడు. కొవ్వు శాతాన్ని నిర్వహించడం అనేది చాలా కఠినమైన లక్ష్యం. దీనిని సాధించడానికి, చోప్రా పండ్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటాడు.

నీరజ్ చోప్రా రోజును జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లతో ప్రారంభిస్తాడు. తర్వాత మూడు నుండి నాలుగు గుడ్డులోని తెల్లసొన, రెండు బ్రెడ్ ముక్కలు, ఒక గిన్నె మొలకలు, పండ్లతో కూడిన ఆరోగ్యకరమైన అల్పాహారం ఉంటుంది.

మధ్యాహ్న భోజనం కోసం సాధారణంగా పెరుగు, అన్నంతో పాటు పప్పులు, కాల్చిన చికెన్, సలాడ్‌లను తీసుకుంటాడు. డిన్నర్ గా తేలికైన భోజనం తీసుకుంటాడు. అంటే సాధారణంగా సూప్, ఉడికించిన కూరగాయలు, పండ్లను రాత్రి తీసుకుంటాడు. భోజన సమయం మధ్యలో డ్రై ఫ్రూట్స్‌తో చిరుతిండి, తాజా జ్యూస్ ను తాగుతాడు.

2016 వరకు చోప్రా శాఖాహార ఆహారం మాత్రమే తినేవాడు. ఆ తర్వాత అతను తన భోజనంలో మాంసాహారాన్ని చేర్చుకున్నాడు. “డైట్‌లో సాల్మన్‌ చెప్పాను చేర్చుకున్నట్లు ఒకసారి నీరజ్ స్వయంగా వెల్లడించాడు కూడా,,

26 ఏళ్ల నీరజ్ చోప్రా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తాడు. పానీ పూరీ, స్వీట్లు అతనికి ఇష్టమైనవి. పానీ పూరీ తినడం వలన ఫిట్నెస్ కు నష్టమేమీ ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. . ఎందుకంటే అందులో ఎక్కువగా నీళ్ళు ఉంటాయి. కడుపులో ఎక్కువ భాగం నీటితో నిండిపోతుందని చెబుతాడు ఈ బల్లెం వీరుడు.

2024 పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ అందుకున్నాడు. వరసగా రెండు ఒలంపిక్స్ లో పసిడి, రజత పతకాలు అందుకున్న క్రీడాకారుడిగా రికార్డ్ సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..