Video: వామ్మో.. ఇదెక్కిడి ఘోరం.. ఆడి గెలవలేక ప్రత్యర్థికి విషమిచ్చిన చెస్ ప్లేయర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్..

సాధారణంగా ఏ ఆటలోనైనా తమ శక్తియుక్తులతో ఆటగాళ్లు గెలవాలని కోరుకుంటుంటుంటారు. అలాగే ప్రత్యర్థులను ఓడించి సంబరాలు చేసుకోవాలని సంబర పడుతుంటారు. కానీ, మరికొందరుమాత్రం ప్రత్యర్ధులను శారీరకంగా దెబ్బతీయడం ద్వారా విజయం సాధించానలి కోరుకుంటుంటారు. ఇందుకోసం పక్కదారి పట్టి, వారిపై కుట్రలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే రష్యాలో చోటుచేసుకుంది. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌కు చెందిన 40 ఏళ్ల చెస్ క్రీడాకారిణి అమీనా అబ్కరోవా తన ప్రత్యర్థిపై విషం చిమ్మింది.

Video: వామ్మో.. ఇదెక్కిడి ఘోరం.. ఆడి గెలవలేక ప్రత్యర్థికి విషమిచ్చిన చెస్ ప్లేయర్.. కట్‌చేస్తే.. ఊహించని షాక్..
Chess Player Amina Abkarova
Follow us
Venkata Chari

|

Updated on: Aug 09, 2024 | 4:17 PM

Video: సాధారణంగా ఏ ఆటలోనైనా తమ శక్తియుక్తులతో ఆటగాళ్లు గెలవాలని కోరుకుంటుంటారు. అలాగే ప్రత్యర్థులను ఓడించి సంబరాలు చేసుకోవాలని సంబర పడుతుంటారు. కానీ, మరికొందరు మాత్రం ప్రత్యర్ధులను శారీరకంగా దెబ్బతీయడం ద్వారా విజయం సాధించేందుకు అడ్డదారులు తొక్కుతుంటారు. ఇందుకోసం ప్రత్యర్థి ఆటగాళ్లపై పలు కుట్రలకు పాల్పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే రష్యాలో చోటుచేసుకుంది. రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌కు చెందిన 40 ఏళ్ల చెస్ క్రీడాకారిణి అమీనా అబ్కరోవా తన ప్రత్యర్థిపై పగ పెంచుకుని, ఏకంగా చంపాలని కుట్ర పన్నింది. ఇందుకోసం ఓ ప్లాన్ రెడీ చేసుకుంది. కానీ, సీసీ కెమెరాలో చిక్కి, కటకటాలపాలైంది. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..

తన సత్తాతో గేమ్‌లో గెలవలేక.. మరొకరి ప్రాణాలను బలిగొన్న రష్యా చెస్ క్రీడాకారిణి అమీనా అబ్కరోవా.. ఇప్పుడు పోలీస్టేషన్‌లో చిక్కుకపోయింది. అంతే కాదు ఆమెను రష్యా చెస్ ఫెడరేషన్ సస్పెండ్ చేసింది. ఓ మ్యాచ్‌లో ప్రత్యర్థికి విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. దీంతో చెస్ టోర్నమెంట్ల నుంచి జీవితకాలం నిషేధించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమీనా అబ్కరోవా, 40, ఆమె ప్రత్యర్థి ఉమైగనత్ ఉస్మానోవాకు విషం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అబాకరోవాను అరెస్ట్ చేశారు.

ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఇందులో అబ్కరోవా మ్యాచ్‌కు 20 నిమిషాల ముందు చెస్ బోర్డు వద్దకు వెళ్లింది. కెమెరాలు ఆన్‌లో ఉన్నాయా లేదా చెక్ చేసింది. ఆ తర్వాత చదరంగం బోర్డుకు పాదరసం లాంటి వాటితో పూత పూసింది. అయితే, ఆమె దురదృష్టం అంతా సీసీటీవీలో రికార్డయింది.

నిందితురాలు అమీనా అబ్కరోవాను ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నందున అబ్కరోవాను రష్యా చెస్ పోటీల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు రష్యా చెస్ సమాఖ్య అధ్యక్షుడు ఆండ్రీ ఫిలాటోవ్ తెలిపారు. ఈ నేర రుజువైతే ఆమె జీవితకాల నిషేధాన్ని ఎదుర్కోవచ్చు.

విచారణ తర్వాత, అబ్కరోవా వ్యక్తిగత శత్రుత్వం కారణంగా ఉస్మానోవాకు విషం ఇచ్చినట్లు అంగీకరించింది. ఉస్మానోవాను చంపడమే తన ఉద్దేశ్యమని, తనను భయపెట్టడం కాదంటూ ఆమె పేర్కొంది.

అబ్కరోవా చర్యలపై డాగేస్తాన్ క్రీడా మంత్రి సాజిదా సాజిదోవా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఆలోచనలు ఎంతో ప్రమాదరకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..