AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics: ఇదెక్కడి రచ్చ.. అందంగా ఉందని పరాగ్వే స్విమ్మర్‌ను ఒలింపిక్స్ నుంచి పంపేశారంట?

Paraguayan swimmer Luana Alonso: ప్రస్తుతం పారిస్‌లో 2024 ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా సాగుతున్నాయి. జులై 26 నుంచి ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో ఎంతోమంది విజేతలుగా తమ సత్తా చాటుతున్నారు. అలాగే, పలు వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో వార్త కూడా క్రీడా ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Paris Olympics: ఇదెక్కడి రచ్చ.. అందంగా ఉందని పరాగ్వే స్విమ్మర్‌ను ఒలింపిక్స్ నుంచి పంపేశారంట?
Paraguayan Swimmer Luana Al
Venkata Chari
|

Updated on: Aug 09, 2024 | 4:09 PM

Share

Paraguayan swimmer Luana Alonso: ప్రస్తుతం పారిస్‌లో 2024 ఒలింపిక్స్ క్రీడలు అట్టహాసంగా సాగుతున్నాయి. జులై 26 నుంచి ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. ఈ కాలంలో ఎంతోమంది విజేతలుగా తమ సత్తా చాటుతున్నారు. అలాగే, పలు వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరో వార్త కూడా క్రీడా ప్రపంచంలో హల్చల్ చేస్తోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పరాగ్వే స్విమ్మర్ లువానా అలోన్సో పారిస్ ఒలింపిక్స్ నుంచి స్వదేశానికి తిరిగి పంపినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆమె అందం కారణంగానే బయటకు పంపిచారనే ప్రచారం జరిగింది. ఆమె అందంతో జట్టులోని ఇతర ఆటగాళ్లను తప్పుదోవ పట్టిస్తోందని కూడా చెవుతున్నారు. అయితే, దీనిపై తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇస్తూ.. ఇలాంటి వార్తలు తప్పంటూ చెప్పుకొచ్చింది.

ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక కథనంలో, ‘నన్ను ఎవరు పంపించలేదు. అలాగే ఇలాంటి తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దంటూ రాసుకొచ్చింది. అయితే, లువానా తన అందం కారణంగా పలు చర్చలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఆమెను క్రీడా గ్రామం నుంచి బహిష్కరించినట్లు వార్తలు వచ్చాయి.

View this post on Instagram

A post shared by Luana Alonso (@luanalonsom)

మహిళల 100 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో స్విమ్మర్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ కారణంగా ఆమె ఇంటికి చేరింది. కానీ, చాలా రిపోర్టులు ఆమె ముందస్తు రిటైర్మెంట్ లేదా తప్పుడు ప్రవర్తన కారణంగా ఒలింపిక్ విలేజ్‌ను త్వరగా విడిచిపెట్టినట్లు పేర్కొన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..