Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్ పతకాల లిస్టు ఇదే.. ఇప్పటివరకు ఎవరెన్ని సాధించారంటే.?
ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా మరో చరిత్ర రాశాడు. టోక్యోలో బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్.. ఈసారి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు భారత్‌లో ఊసే లేని జావెలిన్ త్రోలో పతకాన్ని తీసుకురావడమే గొప్ప అయితే.. నీరజ్ దాన్ని రెండు సార్లు సాధించడం..
ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా మరో చరిత్ర రాశాడు. టోక్యోలో బంగారు పతకాన్ని తీసుకొచ్చిన నీరజ్.. ఈసారి రజతాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అసలు భారత్‌లో ఊసే లేని జావెలిన్ త్రోలో పతకాన్ని తీసుకురావడమే గొప్ప అయితే.. నీరజ్ దాన్ని రెండు సార్లు సాధించడం.. అనన్య సామాన్యం. జావెలిన్ త్రో ఫైనల్లో.. 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచాడు చోప్రా. తొలి స్థానంలో 92.97 మీటర్లు విసిరిన పాక్ అథ్లెట్ నదీమ్.. ఒలింపిక్ రికార్డుతో బంగారం సాధించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో వరుసగా రెండు పతకాలు సాధించడం ఇదే తొలిసారి.
గురువారం ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి. నీరజ్ సిల్వర్ సాధిస్తే.. హాకీ జట్టు బ్రాంజ్ మెడల్ మన ఖాతాలో వేసింది. స్పెయిన్‌తో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేసింది భారత హాకీ జట్టు. స్పెయిన్‌పై 2-1 గోల్స్ తేడాతో నెగ్గింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో కాంస్య పతకం వచ్చి చేరింది. 47 ఏళ్ల తర్వాత వరుసగా 2 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది హాకీ టీమ్. ఈ ఆటతో.. గోల్ కీపర్ శ్రీజేష్ ఆటకు వీడ్కోలు పలికాడు.
పురుషుల రెజ్లింగ్‌లో మన కుర్రాడు అమన్ షెరావత్ సెమీస్ వరకు దూసుకొచ్చినా.. అక్కడ నెంబర్ వన్ సీడ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. 0-10 తేడాతో ఓడినా.. ఈరోజు జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఆడనున్నాడు. ప్యూర్టో రికోకి చెందిన డారియన్ క్రజ్‌తో అమితుమీ తేల్చుకోనున్నాడు. గోల్ఫ్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో.. అదితి అశోక్, దీక్షా దగర్ మూడో రౌండ్‌లోకి ఎంటరయ్యారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కి ఈ పోటీ జరగనుంది. మహిళల 400 మీటర్ల రిలేలో మన అమ్మాయిలు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 2.10కి ఈ పోటీ జరగనుంది. ఆతర్వాత పురుషుల 400 మీటర్ల రిలే పోటీలు జరుగుతాయి.
#WATCH | Haryana: On Neeraj Chopra winning a silver medal in men’s javelin throw at #ParisOlympics2024, his father Satish Kumar says, “Everyone has their day, today was Pakistan’s day…But we have won silver, and it is a proud thing for us…” pic.twitter.com/YQNpdTDYzg
— ANI (@ANI) August 8, 2024
మరిన్ని ఒలింపిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..