Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?

పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు సార్లు ఒలింపిక్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. శుక్రవారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. తద్వారా రజతాన్ని సొంతం చేసుకున్నారు.

Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?
Neeraj Chopra
Follow us

|

Updated on: Aug 09, 2024 | 7:12 AM

పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండు సార్లు ఒలింపిక్ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. గురువారం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్‌లో బల్లెం 89.45m దూరం విసిరి రెండో స్థానంలో నిలిచారు. తద్వారా రజతాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే  పాక్ అథ్లెట్ నదీమ్ 92.97m విసిరి తొలి స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నారు. గ్రెనడా అథ్లెట్ పీటర్స్ కాంస్య పతకాన్ని గెలిచారు. మరోవైపు ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది తొలి రజతం కాగా.. మొత్తం పతకాల సంఖ్య ఐదుకు చేరింది. రజతంతో.. నీరజ్ చోప్రా ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో భారతీయుడిగా నిలిచారు. 2008, 2012లో సుశీల్ కుమార్, 2016, 2020లో పీవీ సింధు, 2024లో మనూ భాకర్ ఈ లిస్టులో నీరజ్ చోప్రా కంటే ముందున్నారు. మనూ భాకర్ ఈ ఒలింపిక్స్‌లోనే రెండు మెడల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. నీరజ్ టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకోగా.. ఈసారి రజతం అందుకున్న విషయం తెలిసిందే.

పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచాక నీరజ్ చోప్రా మాట్లాడుతూ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘2016 నుంచి అతనితో పోటీ పడుతున్నాను. కానీ తోలిసారి ఓడిపోయాను. అర్షద్ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇవాళ నాకన్నా ఉత్తమ ప్రదర్శన చేశాడు’ అని పేర్కొన్నారు. మరోవైపు ఇతర అథ్లెట్ల వలె తనకు వసతులు లేవని, ఉన్నవాటితోనే కష్టపడినట్టు గోల్డ్ విన్నర్ నదీమ్ చెప్పారు.

నీరజ్‌ చోప్రా సిల్వర్‌ మెడల్‌ సాధించడంతో హర్యానాలోని ఆయన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి. ఆయన కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని పండగ చేసుకున్నారు. అటు పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా గెలిచిన సిల్వర్ మెడల్ తనకు బంగారంతో సమానమని ఆయన తల్లి సరోజ్ దేవి తెలిపారు. నీరజ్‌కు గాయమైందని, అయినప్పటికీ అతని ప్రదర్శనతో తాము చాలా సంతోషంగా ఉన్నామని అన్నారు. అటు స్వర్ణం గెలిచిన నదీమ్ కూడా తనకు కొడుకుతో సమానమని అభివర్ణించారామె.

మరిన్ని ఒలింపిక్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?
పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాక నీరజ్ ఏమన్నారంటే.?
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఫోన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటే ఎలా?
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఫోన్ నంబర్ అప్ డేట్ చేసుకోవాలంటే ఎలా?
నేడే తెలంగాణ CPGET 2024 ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్
నేడే తెలంగాణ CPGET 2024 ఫలితాలు.. రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం.. ప్రధాని మోదీ అభినందనలు..
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్‌కు స్వర్ణం.. ప్రధాని మోదీ అభినందనలు..
టీజీ పీజీఈసెట్ 2024 ప్రవేశాలకు రీషెడ్యూల్ విడుద‌ల‌
టీజీ పీజీఈసెట్ 2024 ప్రవేశాలకు రీషెడ్యూల్ విడుద‌ల‌
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..
ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..
నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన స్టార్ హీరో.. వీడియో
నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించిన స్టార్ హీరో.. వీడియో
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి భారతీయుడు 2.. ఎక్కడ చూడొచ్చంటే?
కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏమైందంటే?
కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏమైందంటే?
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
పశువుల పాకలో చిరుత డెలివరీ.. స్థానికుల రక్షణలో 3 పసికూనలు.!
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
ఒకటోసారి.. రెండోసారి.. పోలీస్‌స్టేషన్‌లో పందెంకోళ్ల వేలం.
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
భారత్ పై చైనా వాటర్ బాంబ్.! ఎక్కడ ప్రయోగించారంటే..
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
అది నిజం కావాలని ఆశిద్దాం.! పవన్ , రవితేజ పై డైరెక్టర్ కామెంట్స్.
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
బరువెక్కిన హృదయంతో అభిమానులకు బహిరంగ లేఖ.!
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
నెట్‌ఫ్లిక్స్‌లో దూసుకుపోతున్న జక్కన్న డాక్యుమెంటరీ.! ట్రేండింగ్
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అల్లు స్నేహ & పిల్లలు
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థంపై స్పందన. వీడియో వైరల్
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
బిగ్ అప్డేట్.! ఇక డ్రాగన్ రాక లాంఛనమే.. షూటింగ్ మొదలు అప్పుడే.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!
ఘోర అపచారం.. గర్భగుడిలో మూల విరాట్‌తో పాటు దర్శన్‌కు అభిషేకం.!