Chanakya Niti: విజయం సొంతం కావాలంటే.. శత్రువుని ఓడించడం నేర్చుకోమంటున్న ఆచార్య చాణక్య

ఎవరైనా సరే విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు.. మీ శత్రువులను సమయానికి ఓడించే మార్గాలను కూడా నేర్చుకోవడం అవసరం. చాణక్య విధానం ప్రకారం.. ఒక వ్యక్తి తన శత్రువును ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు.

Chanakya Niti: విజయం సొంతం కావాలంటే.. శత్రువుని ఓడించడం నేర్చుకోమంటున్న ఆచార్య చాణక్య
Acharya Chanakya 1
Follow us
Surya Kala

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2023 | 3:03 PM

ప్రతి వ్యక్తి విజయం కోసం తన శక్తికి మించి కష్టపడతాడు.  తాను చేపట్టిన పనిలో సక్సెస్ అందుకుని.. అది ఇచ్చే గుర్తింపుతో తాను అప్పటి వరకూ పడిన కష్టాన్ని, శ్రమని మరచిపోతాడు. అయితే విజయం సంతోషన్నీ ఇవ్వడమే కాదు.. కొంతమంది అసూయపరులను శత్రువులను కూడా ఇస్తుంది. ఇతరులకు దక్కిన విజయాన్ని ఓర్వలేని వారు శత్రువులుగా మారి దాడిచేయడానికి సిద్ధంగా ఉంటారు. విజయం సాధించిన తర్వాత.. ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే.. అప్పుడు ఆచార్య చాణక్యుడి చెప్పిన కొన్ని నీతి సూత్రాలను పాటించి చూడండి. చాణక్యుడి ప్రకారం.. ఎవరైనా సరే విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయడంతో పాటు.. మీ శత్రువులను సమయానికి ఓడించే మార్గాలను కూడా నేర్చుకోవడం అవసరం. చాణక్య విధానం ప్రకారం.. ఒక వ్యక్తి తన శత్రువును ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. లేకపోతే శత్రువు మీకు హాని కలిగించవచ్చు. కనుక ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రంలో పేర్కొన్న సూత్రాలను అనుసరించి.. శత్రువును ఎలా సులభంగా ఓడించవచ్చునో తెలుసుకుందాం.

ఆచార్య చాణక్యుడి చెప్పిన ఈ విషయాలను అనుసరించండి

  1. చాణక్య విధానం ప్రకారం..  ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనిషి సానుకూలంగా ఆలోచించాలి. శత్రువు ముందు మీకు ఓటమి ఎదురైనా సహనం కోల్పోవద్దు.
  2. చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి తన కోపాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. కొన్నిసార్లు వ్యక్తి కోపంతో తన తెలివిని కోల్పోతాడు. కోపంతో ఉన్న వ్యక్తి తనకు సరికాని నిర్ణయాలను తీసుకుంటాడు.
  3. ఇవి కూడా చదవండి
  4. కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల శత్రువుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ప్రతి అంశాన్ని కూల్‌ మైండ్‌తో ఆలోచించి, అర్థం చేసుకుని, ఆపై ఏదైనా అడుగు వేయాలి.
  5. చాణక్య నీతి ప్రకారం, శత్రువును ఎప్పుడూ బలహీనంగా పరిగణించకూడదు. అతను మీ కంటే బలహీనుడైనప్పటికీ, అతని బలాన్ని బాగా అంచనా వేయండి.
  6. శత్రువు మీకంటే శక్తిమంతుడైతే.. అప్పుడు అతనికి అనుకూలంగా నడవాలి. అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. శత్రువులపై అక్కడికక్కడే దాడి చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?