Telangana: దేవుడిని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు.. మండిపడుతున్న భక్తులు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు..
నారాయణపేట జిల్లా కోస్గీలోని శివాజీ చౌక్‌లో స్వాములు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నరేష్ అనే వ్యక్తిపై దాడి జరిగింది. నాస్తికుడైన వ్యక్తి తమను ఎందుకు వీడియో తీస్తున్నాడంటూ స్వాములు...
తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప మాలధారులు ఆందోళనకు దిగారు. నారాయణపేట జిల్లా కోస్గీలోని శివాజీ చౌక్‌లో స్వాములు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నరేష్ అనే వ్యక్తిపై దాడి జరిగింది. నాస్తికుడైన వ్యక్తి తమను ఎందుకు వీడియో తీస్తున్నాడంటూ స్వాములు నిలదీశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బైరి నరేశ్. అయ్యప్ప స్వామి జననాన్ని, పురణాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. పురాణాలను పిల్లల నెత్తిపై రుద్దారని మండి పడ్డాడు. రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఓ సభలో భైరి నరేశ్.. అనే వ్యక్తి అయ్యప్ప స్వామిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో తెలంగాణ వ్యాప్తంగా వైరల్ కావడంతో అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్ పై ఫైర్ అయ్యారు.
ఎంతోమంది నమ్మకంగా కొలిచే అయ్యప్పస్వామిని కించపరుస్తూ మాట్లాడంపై పటాన్‌చెరులో అయ్యప్పస్వాములు ఆందోళనకు దిగారు. భైరి నరేశ్ ను వెంటనే పీడీయాక్ట్ కింద అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ దేవుళ్ళను తిడితే తొందరగా పబ్లిసిటీ కావచ్చని కొందరు ఈ మధ్య ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మేడ్చల్‌లో అయ్యప్ప భక్తులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలని కోరారు.
ఆదిలాబాద్ ఇచ్చోడలోని అంబేడ్కర్ చౌక్ వద్ద అయ్యప్ప భక్తులు రోడ్డు పైకి వచ్చి నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ ముందు అయ్యప్ప స్వాముల ధర్నా చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్పస్వామి, హిందూదేవుళ్లపై కొడంగల్‌సభలో బైరి నరేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రంగారెడ్డిజిల్లా మొయినాబాద్‌లో అయ్యప్పస్వాములు, భజరంగ్‌దల్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. జై శ్రీరామ్, అయ్యప్ప నామ స్మరణతో మారుమోగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..