Chanakya Niti: వ్యక్తి ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే.. ఈ 5 విషయాలను పాటించమంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya) రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది. వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya) రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది. వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం. ఎవరైనా విజయం సొంతం చేసుకోవాలంటే.. ఆచార్య చాణక్యుడు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాడు. ఐదు ముఖ్యమైన విషయాలను పాటిస్తే.. ఏ వ్యక్తి అయినా తన లక్ష్యాన్ని చేరుకుంటాడని తెలిపాడు. ఈరోజు ఆ ఐదు లక్ష్యాలు ఏమిటో చూద్దాం.
*మనిషికి క్రమశిక్షణ చాలా ముఖ్యమైనదని ఆచార్య చాణక్యుడు అభివర్ణించాడు. క్రమశిక్షణ లేని వ్యక్తి తన జీవితంలో ఎటువంటి పనులు చేయలేడు. విజయం సాధించాలనుకునే వ్యక్తి ముందుగా క్రమశిక్షణను జీవితంలో భాగం చేసుకోమని చాణక్యుడు సుచిస్తున్నాడు.
*మనిషి అదృష్టాన్ని నమ్ముకుని కూర్చుంటే ఎప్పటికీ విజయాన్ని పొందలేడు. నిజంగా విజయం సాధించాలనుకునే వ్యక్తి.. కర్మను నమ్మి.. చిత్తశుద్ధితో పని చేయండి.
*ఏ పని మొదలు పెట్టాలన్నా రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదనేది విజయానికి మోదటి సూత్రం. అయితే, ఆలోచించకుండా ఏ నిర్ణమైనా తీసుకోమని అర్థం కాదు. పని మొదలు పెట్టే ముందు.. మొదట క్షుణ్ణంగా తనిఖీ చేసి, పరీక్షించి ఆపై నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునే ముందు, దాని ఫలితాన్ని కూడా పరిగణిగణలోకి తీసుకోవాలి. తద్వారా మీరు ఆశించిన ఫలితం పొందకపోయినా, మీరు చింతించాల్సిన అవసరం ఏర్పడదు.
*మీరు జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించాలనుకుంటే, మీతో పాటు కొంతమంది నమ్మకమైన వ్యక్తులను తోడుగా ఎల్లప్పడు ఉంచుకోవాలి. పెద్ద లక్ష్యాలను ఎప్పుడు ఒక్కరే సాధించలేరు. అటువంటి పరిస్థితిలో, మీరు మంచి నాయకుడిగా మారాలి.. అదే సమయంలో అందరితోనూ కలిసి పని చేయాల్సి ఉంటుంది.
మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు.. నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను అని మీలో మీరు ప్రశ్నించుకోవాలి. ఈ పని చేస్తే ఫలితం ఎలా ఉంటుంది? సక్సెస్ అవుతుందా? సమాధానాలు నమ్మకంగా వస్తేనే అప్పుడు పని చేసే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: హిందూపురం విషయంలో ప్రభుత్వానికి ఊహించని సెగ.. పార్టీ నాయకులే ముందుండి..