Ratha Saptami: ఆరోగ్యం, కుటుంబ సమస్యలను తొలగించే రథ సప్తమి.. పూజ, ముహుర్త సమయం తెలుసుకోండి

Ratha Saptami 2022: సూర్యుడి పుట్టిన రోజున రథ సప్తమి(Ratha Saptami)గా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మాఘ మాసం(magha masam)లోని శుక్ల పక్షంలోని ఏడవ రోజున రథ సప్తమిగా భక్తి..

Ratha Saptami: ఆరోగ్యం, కుటుంబ సమస్యలను తొలగించే రథ సప్తమి.. పూజ, ముహుర్త సమయం తెలుసుకోండి
Ratha Saptami 2022
Follow us
Surya Kala

|

Updated on: Jan 29, 2022 | 9:21 AM

Ratha Saptami 2022: సూర్యుడి పుట్టిన రోజున రథ సప్తమి(Ratha Saptami)గా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం మాఘ మాసం(magha masam)లోని శుక్ల పక్షంలోని ఏడవ రోజున రథ సప్తమిగా భక్తి ,విశ్వాసంతో ఆచరిస్తారు. మత్స్య పురాణం ప్రకారం.. సూర్యదేవుని (sun worship)పూజించే రోజు. రథ సప్తమి నాడు చేసే స్నానము, దానము, గృహము, పూజలు మొదలైన పుణ్య ఫలాలు వేయి రెట్లు అధికంగా ఇస్తాయని నమ్మకం. ఈ సారి ఈ వ్రతం (ratha saptami) ఫిబ్రవరి 7 న వచ్చింది. ఈ రథ సప్తమిని అచల సప్తమి, సూర్య రథ సప్తమి, ఆరోగ్య సప్తమి మొదలైన పేర్లతో కూడా పిలుస్తారు.

రథ సప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేస్తారు. ఎక్కువ మంది భక్తులు ప్రత్యేకంగా గంగాస్నానం చేస్తారు. ఈ రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారని నమ్ముతారు. అందుకే రథ సప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు.

రథసప్తమి శుభ సమయం ఫిబ్రవరి 7, సోమవారం సాయంత్రం 4:37కి సప్తమి తిథి సప్తమి తిథి ప్రారంభమవుతుంది.. సప్తమి తిధి ఫిబ్రవరి 8 మంగళవారం, ఉదయం 6:15కి ముగుస్తుంది. రథసప్తమి నాడు స్నాన ముహూర్తం: ఫిబ్రవరి 7, ఉదయం 5:24 నుండి 7:09 వరకు

అర్ఘ్యదానం సూర్యోదయ సమయం: 7 :05

రథసప్తమి రోజున ఎలా పూజించాలంటే.. రథ సప్తమి రోజున తెల్లవారు జామునే స్నానం చేసి.. సూర్య భగవానుడికి అర్ఘ్యదానం చేయాలి. నదిలో పువ్వు మొదలైన వాటితో అర్ఘం అర్పించాలి. అనంతరం సూర్యభగవానునికి నెయ్యి దీపం, ఎర్రటి పువ్వులు, కర్పూరం, ధూపం వేసి పూజించాలి. ఉపవాస దీక్ష చేపట్టి.. బాధల నుండి విముక్తి కోసం ప్రార్ధించండి.

శాశ్వత ఫలం: రథసప్తమి వ్రతం పాటించిన వారికి జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం చేయలేని వారు కేవలం సూర్య భగవానునికి జలాన్ని సమర్పించినా భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. శారీరక సమస్యలతో బాధపడేవారు ఈ రోజు తప్పనిసరిగా పూజ చేయాలి. ఈ రోజున సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి.

రథ సప్తమి ఉపవాస ఫలితం: తండ్రితో సత్సంబంధాలు లేని వారు, పిల్లలతో అనుబంధం లేనివారు, తరచుగా అనారోగ్యానికి గురయ్యేవారు, ఉద్యోగం , వృత్తిలో, చదువులో ఆటంకాలు ఏర్పడుతున్నా రథ సప్తమి చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

Also Read:   కొవిడ్ థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ చేరేది ఎప్పుడు? వైద్య నిపుణుల మాట ఇదే..