Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ధన, ధాన్య లాభాలు పొందుతారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (29-01-2022): చాలామంది రోజులో ఎటువంటి కొత్త పనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు...
Horoscope Today (29-01-2022): చాలామంది రోజులో ఎటువంటి కొత్త పనులు, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జనవరి 29 వ తేదీ ) శనివారం (Satur day) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు మంచి ఫలితాలను అందుకుంటారు. కొత్త పనులు ప్రారంభిస్తారు.ధన వ్యయం చేస్తారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. కీలక వ్యవహారాలలో సమస్యలు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం వలన మేలు జరుగుతుంది.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. అభివృద్ధికి సంబంధించి శుభవార్త వింటారు.
కర్కాటక రాశి: ఈరోజు చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. పెద్దల ప్రశంసలు లబిస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. తోటివారి సహకా
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అధిక వ్యయం చేసే అవకాశం ఉంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనులను పట్టుదలతో అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు బంధు, మిత్రుల సహకారాన్ని అందుకుంటారు. ఆర్ధికంగా అన్ని విధాల మేలు జరుగుతుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ధన, ధాన్య లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో చేపట్టిన పనులను బంధు, మిత్రుల సహకారంతో పూర్తి చేస్తారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగాలి.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అధికంగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది. వాగ్వాదానికి దూరంగా ఉండడం మంచిది. అనవర ధన వ్యయం చేసే అవకాశం ఉంది.
మీన రాశి: ఈరోజు ఈరాశివారు బంధు, మిత్రులతో విబేధాలు ఏర్పడే సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోని వారికి తగిన ప్రోత్సాహం అందుతుంది.
Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.
Also Read: