Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శివుడికి బిల్వ పత్రం ఎందుకు ఇష్టం? పూజలో బిల్వపత్రం ప్రాముఖ్యత? ఎలా పుజించాలంటే?

శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి బిల్వ పత్రం. ఈ చెట్టు మూలాల్లో గిరిజ, కాండంలో మహేశ్వరి, కొమ్మలో దాక్షాయణి, ఆకులో పార్వతి, పుష్పంలో గౌరీదేవి నివసిస్తుందని చెబుతారు. శ్రావణ మాసంలో శివునికి బిల్వ పత్రం సమర్పించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం. బిల్వ పత్రం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే బిల్వ పాత్రలను శివుని పూజలో ఉపయోగిస్తారు. శివునికి, బిల్వ పాత్రలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, దీనిని పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

శివుడికి బిల్వ పత్రం ఎందుకు ఇష్టం? పూజలో బిల్వపత్రం ప్రాముఖ్యత? ఎలా పుజించాలంటే?
Bilwa Patra Shiva Puja
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2024 | 11:06 AM

హిందూ మతంలో శివుడిని చాలా సులభంగా సంతోష పెట్టవచ్చు అని నమ్మకం. కేవలం జలంతో అభిషేకించినా చాలు కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. అందుకనే ఎవరైనా సరే మనస్పూర్తిగా పరమశివుని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెబుతారు. హృదయపూర్వకంగా పూజించిన భక్తుడి పట్ల మహాదేవుడు కరుణ చూపిస్తాడు. అదే విధంగా పరమశివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. అలా శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి బిల్వ పత్రం. ఈ చెట్టు మూలాల్లో గిరిజ, కాండంలో మహేశ్వరి, కొమ్మలో దాక్షాయణి, ఆకులో పార్వతి, పుష్పంలో గౌరీదేవి నివసిస్తుందని చెబుతారు.

శ్రావణ మాసంలో శివునికి బిల్వ పత్రం సమర్పించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం. బిల్వ పత్రం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే బిల్వ పాత్రలను శివుని పూజలో ఉపయోగిస్తారు. శివునికి, బిల్వ పాత్రలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, దీనిని పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

బిల్వ పత్రాలకు సంబంధించిన పురాణ కథ

శివపురాణం ప్రకారం సముద్ర మథనం నుంచి విడుదలైన విషం వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో పడింది. ఆ విషాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీని తరువాత దేవతలు, రాక్షసులందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుడిని సంప్రదించారు. అప్పుడు పరమశివుడు లోకాన్ని రక్షించడానికి ఆ విషాన్ని స్వీకరించి తన కఠంలో దాచుకున్నాడు.దీంతో శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడంతోపాటు గొంతు నీలంగా మారింది.

ఇవి కూడా చదవండి

పరమశివుని శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశ్వం అగ్నికి ఆహుతైంది. వేడి కారణంగా భూమిపై ఉన్న సకల జీవుల జీవితం కష్టంగా మారింది. సృష్టి ప్రయోజనం కోసం విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివునికి బిల్వ పత్రాన్ని ఇచ్చారు. శివుడు బిల్వ పత్రం తిన్న తర్వాత విషం ప్రభావం తగ్గిందట. అందుకే అప్పటి నుంచి శివునికి బిల్వ పాత్రలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు.

శివునికి బిల్వ పత్రాలను సమర్పించే సమయంలో పాటించాల్సిన నియమాలను కొన్ని గ్రంథాల్లో పేర్కొన్నారు. అవి ఏమిటంటే..?

  1. బిల్వ పత్రాన్ని ఎల్లప్పుడూ మృదువైన ఉపరితలం వైపు మాత్రమే శివునికి సమర్పించాలి.
  2. బిల్వ పత్రాన్ని తెంపి ఎప్పుడూ శివునికి సమర్పించకూడదు.
  3. శివునికి 3 కంటే తక్కువ కాకుండా బిల్వ పత్రాలను సమర్పించాలి.
  4. బిల్వ పత్రాలను ఎల్లప్పుడూ 3,5,7 వంటి బేసి సంఖ్యలలో శివుడి పూజకు ఉపయోగించాలి.
  5. మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలను త్రిమూర్తుల స్వరూపంగా, త్రిశూల రూపంగా పరిగణించబడుతుంది.
  6. బిల్వ పత్రాలను ఎప్పుడూ మధ్యవేలు, ఉంగరపు వేలు , బొటన వేలితో పట్టుకుని శివునికి సమర్పించాలి.

బిల్వ పత్రాలు ఎప్పుడూ అపవిత్రం కావు. కనుక ఇప్పటికే శివుడికి సమర్పించిన బిల్వ పత్రాలను కడిగి మళ్లీ శివయ్యకు సమర్పించవచ్చు. బిల్వ పత్రాలను సమర్పించిన తర్వాత శివలింగాన్ని నీటితో అభిషేకించాలి. ఈ నియమాల ప్రకారం బిల్వ పత్రాలను సమర్పించడం ద్వారా శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. అన్ని కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు