Monsoon Travel Tips: మనదేశంలో ఈ ప్రదేశాలను సరస్సుల నగరాలు అని అంటారు? ఈ సీజన్‌లో పర్యటనకు బెస్ట్ ఆప్షన్

జీవిత భాగస్వామితో వెళ్ళినా నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ అందమైన క్షణాలను గడపవచ్చు. ఇలాంటి చిరస్మరణీయ క్షణాలు మాత్రమే జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి. కనుక ఎప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పచ్చని ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే.. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్న అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను సరస్సుల నగరం అని పిలుస్తారు.

Monsoon Travel Tips: మనదేశంలో ఈ ప్రదేశాలను సరస్సుల నగరాలు అని అంటారు? ఈ సీజన్‌లో పర్యటనకు బెస్ట్ ఆప్షన్
Travel Ini IndiaImage Credit source: Hemant Singh Chauhan/pexel
Follow us
Surya Kala

|

Updated on: Jul 13, 2024 | 9:19 AM

ప్రయాణం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే.. తమ ఆర్ధిక పరిస్తితికి, సమయానికి తగిన విధంగా అందమైన ప్రదేశాలను ఎంచుకుని పర్యటించడానికి ఇష్టపడరు. నది ఒడ్డున లేదా సముద్ర తీరంలో విహరించాలని తమ నచ్చిన వారితో ప్రకృతి అందాలను వీక్షించాలని కోరుకుంటారు. ఒంటరిగా వెళ్ళినా.. ఫ్యామిలీ, స్నేహితులు, లేదా జీవిత భాగస్వామితో వెళ్ళినా నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ అందమైన క్షణాలను గడపవచ్చు. ఇలాంటి చిరస్మరణీయ క్షణాలు మాత్రమే జీవితంలో ఆనందాన్ని ఇస్తాయి. కనుక ఎప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం పచ్చని ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే.. భారతదేశంలో అనేక సరస్సులు ఉన్న అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను సరస్సుల నగరం అని పిలుస్తారు.

ప్రజలు స్వతహాగా ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి వెళ్ళేవారు నదులు, సరస్సులను ఇష్టపడతారు. మీరు కూడా అలాంటి ప్రదేశాలకు వెళ్ళాలని.. విహారయాత్రను ప్లాన్ చేస్తుంటే సరస్సులు, ప్రకృతి అందాలతో నిండి పోయిన ఆ నగరాల పేర్లను తెలుసుకుందాం..

నైనిటాల్ సరస్సుల నగరం: సరస్సుల గురించి మాట్లాడినట్లయితే చాలా మంది ప్రజలు మొదట నైనిటాల్ పేరును తలచుకుంటారు. పర్యాటకులకు ఈ ప్రాంతం చాలా ప్రసిద్ధ గమ్యస్థానంగా ఉంది. ఇక్కడ ఏడు పరస్పర అనుసంధాన సరస్సులు కూడా ఉన్నాయి. భీమ్టాల్ అతిపెద్ద సరస్సు. అంతేకాదు నౌకుచియాటల్, మల్వ తాల్, లోఖంతాల్, హరిష్టల్, నల దమయంతి సత్తాల్, ఖుర్పటల్ వంటి అనేక సరస్సులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఉదయపూర్ : రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరం కూడా సరస్సులతో నిండి ఉంటుంది. ఇక్కడ ఏడు సరస్సులు ఉన్నాయి. వాటిలో ఐదు ప్రధాన సరస్సులు ప్రధానంగా వినిపిస్తాయి. ఇందులో పిచోలా సరస్సు, రంగ్ సాగర్ సరస్సు, దూద్ తలై సరస్సు , ఫతేసాగర్ సరస్సు ఉన్నాయి.

భోపాల్‌ : మధ్యప్రదేశ్ లోని భోపాల్ కూడా అందమైన సరస్సులు ఉన్న నగరం. ఇక్కడి ప్రధాన సరస్సుల గురించి చెప్పాలంటే, మోతియా తలాబ్, లాండియా సరస్సు, సారంగపాణి సరస్సు, మనిత్ సరస్సు, షాహపురా సరస్సు, నవాబ్ సిద్ధిఖీ హసన్ ఖాన్ సరస్సు, మున్షీ హుస్సేన్ ఖాన్ సరస్సు వంటి అనేక సరస్సులు ఉన్నాయి. భోపాల్ కు వెళ్ళిన వారు తప్పని సరిగా ఈ ప్రదేశాలను సందర్శించండి. విశ్రాంతిగా సమయాన్ని గడపండి.

బుండి: రాజస్థాన్‌లో వేడి వాతావరణం ఉన్నా.. ఇక్కడ అనేక సరస్సులు మాత్రమే కాదు అనేక జలపాతాలు కూడా ఉన్నాయి, వీటిని సందర్శించడం ఎవరికైనా చిరస్మరణీయంగా ఉంటుంది. ప్రస్తుతం కనక సాగర్, జైతాసాగర్, సుర్సాగర్ మొదలైన సరస్సులు ఉండగా నావల్ సాగర్ సరస్సు చాలా మంది పర్యాటకులను ఆకర్షిస్తోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..