- Telugu News Photo Gallery Spine Gourd Health Benefits: Eat Kankrol In Monsoon Gets These health Benefits
ఈ సీజన్‌లో దొరికే ఆగాకరతో పాటు ఆకుల నుంచి వేర్ల వరకూ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. ఎలా ఉపయోగించాలంటే
ఆగాకర, ఆకాకర లేదా అడవికాకరను మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉపయోగిస్తారు. వర్షాకాలంలో మార్కెట్ లో సందడి చేసే ఈ ఆకారారను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకుల నుంచి మూలాల వరకు ఈ ఆగాకరలోని అన్ని భాగాలు శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకాకర కాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఈ కూరగాయల ప్రయోజనాలను వివరిస్తుంది. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jul 13, 2024 | 9:56 AM

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు విజ్రుభించే అవకాశం ఎక్కువ. వేల సంఖ్యలో వ్యాధులు వస్తాయి. ప్రతి ఒక్కరూ ఈ సీజనల్ వ్యాధుల వలన ఎక్కువగానో.. తక్కువగానో అనారోగ్యానికి గురవుతారు.

తినే ఆహారంలో ఈ సీజన్ లో లభించే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలని ఆయుర్వేదం పేర్కొంది. అలా వర్షాకాలంలో లభించే కూరగాయ ఆగాకర.. దీనిని ఈ సీజన్ లో తరచుగా తినే ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక వ్యాధుల నుంచి బయటపపడవచ్చు.

ఆగాకర ను కూరగా చేసుకుని తినడం వలన ఎన్ని ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయో.. అదే విధంగా ఆగాకర ఆకులు, మొక్క వేర్లలో కూడా పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.

ఈ సీజన్ లో ఎక్కువగా జట్టు సంభదిత సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలాంటి వారు ఆగాకర కంకరోల్ వేర్ల రసాన్ని జుట్టుకు రాసుకుంటే జుట్టు అకాలంగా నెరవడం తగ్గుతుంది. అంతేకాదు చుండ్రు, జుట్టు పొడిబారడం, జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు దూరమవుతాయి.

ఆగాకర ను తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ B12, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B3, విటమిన్ B5, విటమిన్ B6 లతో పాటు కాల్షియం, జింక్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి.

పని ఒత్తిడి, రోజంతా కంప్యూటర్ ముందు కుర్చుని పని చేయడం వల్ల చాలా మంది తలనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి ఆగాకర ఆకుల రసాన్ని 2 చుక్కలు ముక్కులో వేస్తే తలనొప్పి తగ్గుతుంది.

కడుపు సమస్య ఉన్నవారికి ఆగారక పౌడర్ మంచి మెడిసిన్. దీని పౌడర్ తీసుకోవడం వల్ల ఎలాంటి పొట్ట సమస్య నుంచి అయినా ఉపశమనం లభిస్తుంది. దీనిలో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.





























