Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: కళ్యాణం కమనీయం రామయ్య వైభోగం.. ఆలయానికి ఫస్ట్ గోల్డెన్ గేట్.. మొదటి చిత్రం రిలీజ్

బంగారు పూతపూసిన తలుపులు: రామాలయంలో ప్రతిష్ఠించేందుకు 14 బంగారు తలుపులు సోమవారం రామనగరికి చేరుకున్నాయని శరద్‌బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జనవరి 15 నుంచి ఈ తలుపుల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి. శంకుస్థాపనకు ముందే అన్ని పనులు పూర్తి చేస్తామమని చెప్పారు.

Ayodhya: కళ్యాణం కమనీయం రామయ్య వైభోగం.. ఆలయానికి ఫస్ట్ గోల్డెన్ గేట్.. మొదటి చిత్రం రిలీజ్
Ram Mandir Golden Gate
Follow us
Surya Kala

|

Updated on: Jan 09, 2024 | 9:26 PM

తన జన్మ భూమి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిర ఆలయం వైభవాన్ని ఊహించాడానికి ప్రయత్నిస్తే ఊహకు అందిన దానికంటే ఎక్కువే. రామ మందిర తలుపులు బంగారంతో తయారు చేసినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి రామయ్య వైభవం.. గర్భగుడికి కోసం చేస్తున్న ఏర్పాట్లను అంచనా వేయవచ్చు. ఈ తలుపులను నిర్మించే అదృష్టాన్ని హైదరాబాద్‌కు చెందిన అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ వారు దక్కించుకున్నారు. ఒక్క చిన్న మేకు వంటి వాటిని వినియోగించకుండా తలపులు అత్యంత సుందరంగా రూపొందించారు. మందిరానికి వినియోగిస్తున్న తలుపులను అతి తక్కువ సమయంలో కళాకారుల సహకారంతో పూర్తి చేశామని ఈ సంస్థ యజమాని శరద్ బాబు టీవీ9 భరతవర్ష్‌తో తెలిపారు.

ఈ తలుపులను నగారా శైలిలో తయారు చేసినట్లు శరద్ బాబు తెలిపారు. పెద్ద పెద్ద దేవాలయాలకు తలుపులను తయారు చేసిన అనుభవం ఉందని.. గతంలో కూడా పలు ఆలయాలకు తలుపులు తయారు చేశామని చెప్పారు. కళాకారులు తలుపులపై అపురూప కళాఖండాలను చాలా ఖచ్చితమైన పద్ధతిలో రూపొందించారు.

బంగారు పూతపూసిన తలుపులు: రామాలయంలో ప్రతిష్ఠించేందుకు 14 బంగారు తలుపులు సోమవారం రామనగరికి చేరుకున్నాయని శరద్‌బాబు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలు, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జనవరి 15 నుంచి ఈ తలుపుల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి. శంకుస్థాపనకు ముందే అన్ని పనులు పూర్తి చేస్తామమని చెప్పారు.

ఇవి కూడా చదవండి

1000 సంవత్సరాల వరకు చెడిపోదు

రామాలయ తలుపులు నిర్మాణం కోసం కలపను మహారాష్ట్ర నుంచి తెప్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టేకును కొనుగోలు చేశారు. రామ ఆలయ ప్రాసస్యం దృష్ట్యా అత్యంత నాణ్యమైన కలపని ఎంపిక చేసి తయారు చేసినట్లు చెప్పారు. ఈ తలుపులు రానున్న 1000 సంవత్సరాల వరకు చెడిపోవని పేర్కొన్నారు.

కన్యాకుమారి నుంచి వచ్చిన కళాకారులు

గత ఆరు నెలలుగా తమ టింబర్ డిపోలో పగలనక రాత్రనక 24 గంతలు పనులు జరుగుతున్నట్లు శరద్‌బాబు తెలిపారు. దాదాపు 60 మంది కళాకారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ షిఫ్టు పద్ధతిలో పనులు జరుగుతున్నాయి. తక్కువ సమయంలో అత్యంత విశిష్టమైన పని చేయడం గొప్ప సవాల్ అంటూ.. అయితే శ్రీరాముడి ప్రత్యేక అనుగ్రహం కారణంగానే ఈ పనులు సకాలంలో పూర్తవుతున్నాయని చెప్పారు శరత్ బాబు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..