Andhra Pradesh: విద్యుత్ వైర్ల చోరీకి వెళ్లి చావుని కొని తెచ్చుకున్న యువకుడు.. కరెంట్‌ షాక్‌తో మృతి..

మృతుడు పలుగుటిపల్లి గ్రామానికే చెందిన 30 ఏళ్ళ యువకుడు కాకి రంగస్వామిగా గుర్తించారు. గ్రామస్థుల ద్వారా మృతుని బంధువులకు సమాచారం అందించారు. కాకి రంగస్వామి రాత్రి వేళలో పొలానికి వచ్చి కరెంట్‌ షాక్‌కు గురైనట్టు అనుమానించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రంగస్వామి గతంలో కూడా ఇలాగే పొలాల్లో స్టార్టర్లు, విద్యుత్‌ వైర్లు చోరీలు చేసినట్టు గుర్తించారు.

Andhra Pradesh: విద్యుత్ వైర్ల చోరీకి వెళ్లి చావుని కొని తెచ్చుకున్న యువకుడు.. కరెంట్‌ షాక్‌తో మృతి..
Andhra Pradesh
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jan 09, 2024 | 7:16 PM

ప్రకాశంజిల్లా రాచర్ల మండలం పలుగుటిపల్లి గ్రామంలోని పొలాల్లో ఓ వ్యక్తి మృత దేహాన్ని ఉదయం పొలాలకు వెళ్ళిన రైతులు గుర్తించారు. మృతి చెందిన ఆ వ్యక్తి కరెంట్‌ షాక్‌కు గురై చనిపోయినట్టు ఆనవాళ్ళు కనిపించాయి. వెంటనే రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించే పనిలో పడ్డారు. మృతుడు పలుగుటిపల్లి గ్రామానికే చెందిన 30 ఏళ్ళ యువకుడు కాకి రంగస్వామిగా గుర్తించారు. గ్రామస్థుల ద్వారా మృతుని బంధువులకు సమాచారం అందించారు. కాకి రంగస్వామి రాత్రి వేళలో పొలానికి వచ్చి కరెంట్‌ షాక్‌కు గురైనట్టు అనుమానించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో రంగస్వామి గతంలో కూడా ఇలాగే పొలాల్లో స్టార్టర్లు, విద్యుత్‌ వైర్లు చోరీలు చేసినట్టు గుర్తించారు. దీంతో రాత్రి వేళలో పొలంలొ విద్యుత్‌ స్టార్టర్‌ను చోరీ చేసేందుకు వచ్చి ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోయినట్టు అనుమానిస్తున్నారు.

పలుగుటిపల్లిలో అర్ధరాత్రి పొలంలోకి వెళ్ళిన రంగస్వామి విద్యుత్‌ పోల్‌ పక్కనే శవమై కనిపించాడు.  మృత దేహం పక్కనే విద్యుత్‌ స్థంభం, కరెంట్‌ సరఫరా చేసేందుకు తీసుకున్న కనెక్షన్‌ తాలూకూ ఫీజుల బాక్స్‌ ఉంది. ఫీజు బాక్స్‌ తెరిచి ఉంది… ఆ పక్కనే విద్యుత్‌ మోటారు ఉంది… గతంలో పొలాల్లోని విద్యుత్‌ మోటారు, స్టార్టర్లు ఇతన విద్యుత్‌ పరికరాలను రంగస్వామి చోరీ చేసే అలవాటు ఉందని గ్రామస్థులు చెప్పారు. ఈ వివరాల ప్రకారం రంగస్వామి అర్ధరాత్రి పొలంలో మోటారు చోరీ చేసేందుకు వచ్చి ఫీజులు తొలగిస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై చనిపోయి ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు… ఈ మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు… పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత రంగస్వామి మరణంపై మరింత క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..