Sankranti Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇవే..
సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ, ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే పలు ప్రకటనలు జారీ చేశాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఏర్పాటు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలు కానుంది.. దీంతో పట్టణ ప్రాంతాల్లో, పలు రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు తమ తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.. ఈ తరుణంలో సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ, ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే పలు ప్రకటనలు జారీ చేశాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో మరో రెండు రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రెండు రైళ్లు హైదరాబాద్ – నర్సాపూర్, నర్సాపూర్ – హైదరాబాద్ మధ్య నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి జనవరి 15 నుంచి 16 తేదీల్లో అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు గమనించగలరని రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
- 07058 హైదరాబాద్ – నర్సాపూర్ ట్రైన్.. 15న హైదరాబాద్ లో రాత్రి 11.10 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 8.35 నిమిషాలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ సికింద్రాబాద్, జనగాం, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లులో హాల్టింగ్ ఉంటుంది..
- 07059 నర్సాపూర్ – హైదరాబాద్ ట్రైన్ 16న నర్సాపూర్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ లో హాల్టింగ్ ఉంటుంది.
సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ నగరాల మధ్య ప్రత్యేక రైళ్ల వివరాలు..
- తిరుపతి – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07055) జనవరి 10వ తేదీన రాత్రి 8.25గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.10గంటలకు చేరుకోనుంది.
- సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07056) జనవరి 11వ తేదీన రాత్రి 7గంటలకు సికింద్రాబాద్ లో బయల్దేరి మరుసటి రోజు ఉదయాన్నే 6.45గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
- కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07057) 12వ తేదీ రాత్రి 9గంటలకు కాకినాడలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు సికింద్రాబాద్ చేసుకుంటుంది.
- సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07071) జనవరి 13వ తేదీన రాత్రి 9గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
- కాకినాడ టౌన్ – తిరుపతి ప్రత్యేక రైలు (07072) జవనరి 14న ఉదయం 10గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.20గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
- తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707) జనవరి 15న తెల్లవారుజామున 5.30గంటలకు తిరుపతిలో బయలుదేరి అదేరోజు సాయంత్రం 5గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..