Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇప్పుడే త్వరపడండి.. లేదంటే మీకే నష్టం..
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్ భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో పెండింగ్ చలాన్లు చెల్లిస్తే..
పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. వాహనాలకు సంబంధించి పెండింగ్ చలాన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్ భారీ డిస్కౌంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత సమయంలో పెండింగ్ చలాన్లు చెల్లిస్తే 50 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అవకాశం డిసెంబర్ 26వ తేదీ నుంచి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని గడువు జనవరి 10 వరకే ప్రకటించింది. ఈ పెండింగ్ చలాన్లపై రాయితీ రేపటితో ముగియనుంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు.. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లు చెల్లించని వారు ఇప్పటికైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మళ్లీ ఇలాంటి ఆఫర్ రాదని.. ఇప్పుడే త్వరపడాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఇలా..
ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్‌లో ఉన్న చలాన్లపై 90 శాతం రాయితీ, ద్విచక్రవాహనాల చలాన్లకు 80 శాతం రాయితీ, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కు 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. అయితే, డిసెంబర్ 25 తర్వాత చెల్లించే చలాన్లకు ఎలాంటి రాయితీ వర్తించదు. అంతకు ముందు పెండింగ్‌లో ఉన్న చలాన్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.
ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.. ఏమైనా సందేహాలుంటే 040-27852721, 8712661690 వాట్సాప్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని ట్రాఫిక్ విభాగం పేర్కొంది. మరికొన్ని గంటల్లో గడువు ముగియనుండటంతో వాహనదారులు పెండింగ్ లో ఉన్న చలాన్లు వెంటనే చెల్లించడం మంచిది.. రేపు ఒక్కరోజు మిస్ అయితే.. డిస్కౌంట్ వర్తించదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..