Ayodhya: రామయ్య తన ఇంట్లో అడుగు పెట్టేవేళ.. యుఎస్‌లో వేడుకలకు రెడీ అవుతున్న భారతీయులు.. భారీ కార్ల ర్యాలీ..

శ్రీరాముడు తన కోసం నిర్మించిన మందిరంలో గృహప్రవేశం చేసే సమయంలో యుఎస్ లోని పలు ప్రాంతాల్లో వేడుకలను జరుపుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట వేడుకను పురస్కరించుకుని 'కాలిఫోర్నియా ఇండియన్స్' గ్రూప్ జనవరి 20న ప్రత్యేక కార్ల ర్యాలీని నిర్వహించడానికి రెడీ అవుతోంది. సౌత్ బే నుంచి ఐకానిక్ గోల్డెన్ గేట్ బ్రిడ్జి వరకు జరిగే ర్యాలీలో 400కు పైగా కార్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.

Ayodhya: రామయ్య తన ఇంట్లో అడుగు పెట్టేవేళ.. యుఎస్‌లో వేడుకలకు రెడీ అవుతున్న భారతీయులు.. భారీ కార్ల ర్యాలీ..
Ayodhya Ram Mandir
Follow us

|

Updated on: Jan 09, 2024 | 4:42 PM

500 ఏళ్ల కల తీరే సమయం ఆసన్నం అవుతోంది. దేశ విదేశాల్లోని కోట్లాది హిందువులు అయోధ్యలో రామమందిరానికి ప్రతిష్ఠాపన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసినా రామ నామ స్మరణ వినిపిస్తోంది. సర్వత్రా పండగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు అయోధ్యలో రామమందిర శంకుస్థాపన వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలో కార్లతో భారీ ర్యాలీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

శ్రీరాముడు తన కోసం నిర్మించిన మందిరంలో గృహప్రవేశం చేసే సమయంలో యుఎస్ లోని పలు ప్రాంతాల్లో వేడుకలను జరుపుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ట వేడుకను పురస్కరించుకుని ‘కాలిఫోర్నియా ఇండియన్స్’ గ్రూప్ జనవరి 20న ప్రత్యేక కార్ల ర్యాలీని నిర్వహించడానికి రెడీ అవుతోంది. సౌత్ బే నుంచి ఐకానిక్ గోల్డెన్ గేట్ బ్రిడ్జి వరకు జరిగే ర్యాలీలో 400కు పైగా కార్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.

జనవరి 22 వరకు ప్రత్యేక ఉత్సవాలు

భారతదేశ ఆధునిక చరిత్రలో అతి పెద్ద వేడుక రామ మందిర ప్రారంభోత్సవం.. ప్రాణ ప్రతిష్ట ప్రతి హిందువు గర్వించదగిన ఈవెంట్‌ అని.. ఈ వేడుకను జరుపుకోవడానికి ఉత్తర కాలిఫోర్నియా నుంచి భారీ సంఖ్యలో భారతీయులు పాల్గొననున్నారని నిర్వాహకులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. US వ్యాప్తంగా ఉన్న స్థానిక హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలలో జనవరి 20 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక వేడుకలను జరిపించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించే సమయంలో ప్రత్యెక పూజలు చేయనున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కార్ల ర్యాలీలు

గత కొన్ని వారాలుగా వాషింగ్టన్, చికాగో సహా ఇతర US నగరాల్లో కార్ల ర్యాలీలు జరిగాయి. ఇక కాలిఫోర్నియా ర్యాలీకి రోహిత్ శర్మ, మణికిరణ్, పరమ్ దేశాయ్, దైపాయన్ దేబ్, దీపక్ బజాజ్, బిమల్ భగవత్ సహా సంఘం నాయకులు ప్లాన్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాము ప్రాణ ప్రతిష్ట సమయంలో అయోధ్యకు వెళ్లలేమని.. అయితే రాముడు తమ హృదయాల్లో ఉన్నాడని.. తన ఇంటిలో కొలువు దీరే సమయంలో రామయ్యపై భక్తితో అనేక కార్యక్రమాలను చేపట్టనున్నామని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు