- Telugu News Photo Gallery Spiritual photos Sankranti 2024: Best places in India to experience Makar Sankranti
Sankranti 2024: హిందువుల అతి పెద్ద పండగ మకర సంక్రాంతి.. దేశంలో ఈ ప్రాంతాలు బెస్ట్ ప్లేసెస్
హిందువులు జరుపుకునే అతి పెద్ద పండగల్లో ఒకటి మకర సంక్రాంతి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకునే పండుగ. సూర్యుడు మకర రాశిలోకి అడుగు పెట్టిన సమయాన్ని మకర సంక్రాంతి గా జరుపుకుంటారు. ఈ మకర సంక్రాంతిని వివిధ రాష్ట్రాలలో వివిధ పేర్లతో పిలుస్తారు విభిన్న ఆచారాలతో జరుపుకుంటారు. మకర సంక్రాంతి ఉత్సవాన్ని ఉత్సాహభరితంగా సెలబ్రేట్ చేసుకోవడానికి దేశంలోని కొన్ని ఉత్తమ ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jan 09, 2024 | 6:52 PM

కోనసీమ ఆంధ్రప్రదేశ్: సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఇష్టం. మొదటి రోజున భోగి, రెండో రోజున మకర సంక్రాంతి, మూడో రోజున కనుమ.. నాలుగో రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. సంక్రాంతి పర్వదినం జరుపుకోవడానికి దేశ విదేశాల్లో ఉన్నవారు సైతం తమ స్వగ్రామాలకు చేరుకుంటారు.

గంగా సాగర్, పశ్చిమ బెంగాల్: ఈ ప్రదేశం భారతదేశంలో మకర సంక్రాంతిని జరుపుకునే అత్యంత ప్రముఖమైన ప్రాంతాల్లో ఒకటి. గంగా నది బంగాళాఖాతంలో కలిసే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సాగర్ ద్వీపంలో ఘనంగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఈ ఉత్సవం జరిగే నది, సముద్ర సంగమం వద్ద పవిత్ర స్నానం చేయడానికి వేలాది మంది యాత్రికులు చేరుకుంటారు.

హరిద్వార్, ఉత్తరాఖండ్: భారతదేశంలో మకర సంక్రాంతి ఉత్సవాలను దర్శించాలంటే హరిద్వార్ మరొక ముఖ్యమైన ప్రాంతం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హరిద్వార్ మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. కుంభమేళా జరిగే నాలుగు ప్రదేశాలలో ఒకటి.

తిరునెల్వేలి, తమిళనాడు: దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరునెల్వేలిలో మకర సంక్రాంతిని పొంగల్ పండుగగా జరుపుకుంటారు. ఇక్కడ పంట ఇంటికి వచ్చిన సందర్భంగా జరుపుకునే పండగ. పొంగల్ ను గొప్ప ఉత్సాహంతో, సాంప్రదాయ ఆచారాలతో జరుపుకుంటారు. పండుగ సాధారణంగా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ నాలుగు రోజులు దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

గౌహతి, అస్సాం: ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఉన్న గౌహతి, మకర సంక్రాంతిని మాగ్ బిహు పండుగగా జరుపుకుంటారు. మాగ్ బిహు అనేది పంటల పండుగ. పంటలు కోత అయిన తర్వాత సంతోషంగా రైతులు గొప్ప ఉత్సాహంతో , సాంప్రదాయ ఆచారాలతో జరుపుకుంటారు

వడోదర, గుజరాత్: పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్‌లోని వడోదరలో ముఖ్యంగా ఉత్తరాయణ పండుగ సందర్భంగా మకర సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఉత్తరాయణం గాలిపటాలు ఎగురవేయడానికి పర్యాయపదంగా ఉంటుంది. నగరంలో వివిధ ఆకారాలు, పరిమాణాల గాలిపటాలతో నిండిన ఆకాశం.. రంగురంగుల ఇంద్ర ధనుస్సుగా దర్శనమిస్తుంది





























