AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆపరేషన్ క్లీన్.. ఆఫీసులో చిట్టెలుక పనికి అంతా పరేషాన్.. చెత్తనంతా ఒకే చోట పోగేస్తున్న వీడియో వైరల్

ఎలుకలు ఎక్కువగా సంచరిస్తే ఆ ఇంట్లో ఉన్న వస్తువుల భద్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. తాము సేకరించి వస్తువులు సరైన స్థలంలో ఉంచినా ఎలుకలు వాటిపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. అయితే ఒక ఎలుక తాను అన్నింటికి భిన్నం అని చాటి చెప్పింది. ఒక వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌కి ఒక ఎలుక కెమేరాకు చిక్కింది. ఎలుక తన ఇంట్లో శుభ్రం చేస్తున్న సమయంలో ఒక కెమెరాలో రికార్డ్ అయింది. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ రోడ్నీ హోల్‌బ్రూక్ ఆఫీసుని ఎలుక ప్రతి రాత్రి శుభ్రం చేయడం మొదలు పెట్టింది.

Viral Video: ఆపరేషన్ క్లీన్.. ఆఫీసులో చిట్టెలుక పనికి అంతా పరేషాన్.. చెత్తనంతా ఒకే చోట పోగేస్తున్న వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Jan 09, 2024 | 7:57 PM

Share

చిన్నజీవి అయిన ఎలుక ఇంట్లో కనిపిస్తే చాలు అందరికి చికాకు కలుగుతుంది. ఒక్క ఎలుక కనిపిస్తే చాలు కుటుంబ సభ్యులకు తలనొప్పి తప్పదు. ఎందుకంటే చిన్నగా కనిపించే ఈ జీవి ఇంట్లో బట్టల నుంచి విలువైన వస్తువుల వరకు అన్నింటిని క్షణ కాలంలో నాశనం చేస్తుంది. అయితే ఎలుకలు ఎక్కువగా సంచరిస్తే ఆ ఇంట్లో ఉన్న వస్తువుల భద్రత గురించి ఎంత చెప్పినా తక్కువే. తాము సేకరించి వస్తువులు సరైన స్థలంలో ఉంచినా ఎలుకలు వాటిపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. అయితే ఒక ఎలుక తాను అన్నింటికి భిన్నం అని చాటి చెప్పింది. ఒక వన్యప్రాణి ఫోటోగ్రాఫర్‌కి ఒక ఎలుక కెమేరాకు చిక్కింది. ఎలుక తన ఇంట్లో శుభ్రం చేస్తున్న సమయంలో ఒక కెమెరాలో రికార్డ్ అయింది.

British night photographer

British night photographer

వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ రోడ్నీ హోల్‌బ్రూక్ ఆఫీసుని ఎలుక ప్రతి రాత్రి శుభ్రం చేయడం మొదలు పెట్టింది. ఇలా ఈ ఎలుక రెండు నెలల పాటు శుభ్రం చేసింది. నిరంతరం జరిగిన ఈ వింత సంఘటనకు రోడ్నీ కూడా చాలా ఆశ్చర్యపోయాడు. ఇది కన్ఫామ్ చేసుకోవడానికి ఫోటోగ్రాఫర్ తన గదిలో నైట్ విజన్ కెమెరాను అమర్చాడు. అప్పుడు రోడ్నీ అందులో రికార్డయినది చూసి చలించిపోయాడు. నిజానికి వస్తువులను ఎక్కడ బడితే అక్కడ పడేసి ఉన్నాయి. అపుడు ఓ ఎలుక ఆ వస్తువులను తన చిన్ని నోటితో పట్టుకుని ఒక చోట పోగుచేస్తుంది. ఇప్పుడు ఈ ఎలుక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందరూ ఎలుక చేస్తున్న పనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆఫీసుని శుభ్రం చేస్తున్న ఎలుక

75 ఏళ్ల రోడ్నీ UKలోని వేల్స్ నివాసి. తాను ఈ ఎలుకను ‘వెల్ష్ టిడీ మౌస్’ అని పిలుస్తానని బీబీసీకి తెలిపాడు. కెమెరాలో బంధించిన ఫుటేజీలో తన ఆఫీసులో ఉన్న పనికి రాని వస్తువులను ఎలుక సేకరిస్తున్నట్లు చూపిస్తోంది. ఈ సంఘటన తనకు 2007 యానిమేషన్ చిత్రం రాటటౌల్లెను గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఒక ఎలుక రెస్టారెంట్‌లో రహస్యంగా ఆహారాన్ని వండుకునేది.

ఎలుక చర్యలను చూసిన రోడ్నీకి ఉత్సుకత పెరిగి దాని సామర్థ్యాలను పరీక్షించడం ప్రారంభించాడు. ఎలుక ఎంత బరువును ఎత్తగలదో చూడాలనుకున్నాడు. ఎలుక శక్తిని చూసి రోడ్నీ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎలుక పాత్రలను జాగ్రత్తగా ఒకే స్థలంలో ఉంచిందని చెప్పాడు. ఎలుక శుభ్రం చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు.

అయిటే ఇలా ఎలుక శుభ్రం చేయడం ఇదే మొదటిది సంఘటన కాదు. 2019లో ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ కు చెందిన ఒక వీడియో వైరల్ అయింది. ఇందులో ఒక ఎలుక ఒక వ్యక్తి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. కంటైనర్‌లో చెల్లాచెదురుగా ఉన్న స్క్రూలు, ఇతర మెటల్ వస్తువులను ఒద్దికగా ఒక వైపు ఉంచడం ఆ వీడియోలో చూపించారు.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..