Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashadha Amavasya 2024: ఆషాఢ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృ దోషం తొలగిపోతుంది..! ఈ తప్పులు చేస్తే మాత్రం..

అందుకే ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృ దోషం, కాలసర్ప దోషం నుండి బయటపడవచ్చు అంటున్నారు. ఈ యేడు ఆషాడ అమావాస్య ఎప్పుడు వస్తుంది..? ఆ రోజున ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Ashadha Amavasya 2024: ఆషాఢ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృ దోషం తొలగిపోతుంది..! ఈ తప్పులు చేస్తే మాత్రం..
Ashadha Amavasya
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2024 | 9:44 AM

అమావాస్య తిథి హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి రోజు. మరి కొద్ది రోజుల్లో అమావాస్య రాబోతోంది. మత విశ్వాసాల ప్రకారం ఆషాడ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి. ఈ రోజున స్నానం, దానాలు చేస్తారు. శాస్త్రాల ప్రకారం ఆషాడ మాసంలోని అమావాస్య రోజున.. మరణించిన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని భావిస్తారు. అందుకే ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృ దోషం, కాలసర్ప దోషం నుండి బయటపడవచ్చు అంటున్నారు. ఈ యేడు ఆషాడ అమావాస్య ఎప్పుడు వస్తుంది..? ఆ రోజున ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఆషాఢ అమావాస్య తిథి ఎప్పుడు?

హిందూ క్యాలెండర్ ప్రకారం, అమావాస్య తిథి శుక్రవారం, జూలై 5 ఉదయం 4:57 గంటలకు వస్తుంది. మరుసటి రోజు అంటే జూలై 6 శనివారం తెల్లవారుజామున 4:26 వరకు అమావాస్య ఉంటుంది. జూలై 5న ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

ఆషాఢ అమావాస్యలో ఏం చేయాలి? గ్రంధాల ప్రకారం, ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల పేర్లతో దానం చేయాలి. ఈ రోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చేయండి. పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుశ, నల్ల నువ్వులు, తెల్లటి పువ్వులను మీ చేతులలో ఉంచుకోండి. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనూనె దీపం వెలిగించండి. ఈ రోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున మీరు ఉప్పు, పంచదార కూడా దానం చేయవచ్చు.

ఆషాఢ అమావాస్యలో ఏమి చేయకూడదు?

ఆషాఢ అమావాస్య తిథిలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం. మీరు ఈ రోజును మరచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి. ఈ రోజు మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు. ఈ రోజు ఎవరితోనూ గొడవలు పడకుండా ఉండటం మంచిది. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే, అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకండి.

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..