Watch: ప్రభుత్వ స్కూల్ టీచర్‌కు వేధింపులు.. పెళ్లి చేసుకుంటానంటూ నడిరోడ్డుపై హల్‌చల్..!
ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఒక మహిళ స్కూల్ తర్వాత తండ్రితో కలిసి బైక్‌పై ఇంటిని తిరిగి వెళ్తుంది. ఈ క్రమంలోనే ముఖానికి ముసుగు ధరించిన యువకుడు వారిని అడ్డుకున్నాడు. నాటు తుపాకీతో వారిని బెదిరించాడు. టీచర్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా తండ్రి ప్రతిఘటించాడు.
షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్‌ని పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువకుడు వెంటపడ్డాడు. తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఆమెను అడ్డుకున్నాడు. ఆమె తలపై బలవంతంగా సింధూరం పెట్టాడు. యువతి తండ్రి అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఇదంతా అతడి స్నేహితుడు వీడియో తీశాడు. కాగా, ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంతకీ వీరి మధ్య ఏం జరిగింది.? ఎందుకు ఆ యువకుడు టీచర్ వెంటపడ్డాడు..? పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని బంకా జిల్లాలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న ఒక యువతి స్కూల్ తర్వాత తండ్రితో కలిసి బైక్‌పై ఇంటిని తిరిగి వెళ్తుంది. ఈ క్రమంలోనే ముఖానికి ముసుగు ధరించిన యువకుడు వారిని అడ్డుకున్నాడు. నాటు తుపాకీతో వారిని బెదిరించాడు. టీచర్‌ను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా తండ్రి ప్రతిఘటించాడు. ఆమె వల్ల నేను నాశనమయ్యా. ఆమెను విడిచిపెట్టను అంటూ అరుస్తూ ..బలవంతంగా ఆ మహిళ తలపై సింధూరం పెట్టాడు.
बिहार :बीच सड़क BPSC टीचर की भरी मांग :युवक बोला- 8 साल साथ रही आज दोनों मरेंगे, पिता के साथ स्कूल से लौट रही थी युवती#Bihar #Banka #Biharnews pic.twitter.com/5q3PDWF5qm
— FirstBiharJharkhand (@firstbiharnews) June 27, 2024
జరిగిన ఘటనపై బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. బభంగమాలో నివసించే సౌరభ్ సోను పెళ్లి పేరుతో తన వెంటపడి వేధిస్తున్నాడని ఆరోపించింది. రెండు నెలల కిందట పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారని చెప్పింది. అయినప్పటికీ తనను వేధించడం మానుకోని సౌరభ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సౌరభ్ నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదులో పేర్కొంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..