Watch: హైవేపై ఘోర ప్రమాదం.. రెండు ట్రక్కులు ఢీకొనడంతో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవ దహనం

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బికనీర్‌లోని మహాజన్‌లోని భారతమాల రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొనడంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనతో హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Watch: హైవేపై ఘోర ప్రమాదం.. రెండు ట్రక్కులు ఢీకొనడంతో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సజీవ దహనం
Two Trucks Collided
Follow us

|

Updated on: Jun 27, 2024 | 12:42 PM

బికనీర్‌లోని మహాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌మాల హైవేపై రెండు ట్రక్కులు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఘోర ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. గురువారం ఉదయం బికనీర్‌లోని మహాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌మాల హైవేపై రెండు ట్రక్కుల ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో రెండు ట్రక్కులు మంటల్లో చిక్కుకున్నాయి. ఒక ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని బికనీర్‌లోని పీబీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

వాస్తవానికి, బికనీర్ జిల్లా గుండా వెళుతున్న జామ్‌నగర్-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ హైవేపై జైత్‌పూర్ ట్రక్కు చెడిపోవడంతో ట్రక్ డ్రైవర్, హెల్పర్ రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. వెనుక నుంచి వస్తున్న లారీ అతివేగంతో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు ట్రక్కులు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ సంఘటనలో వెనుక నుండి ఢీకొన్న ట్రక్కు డ్రైవర్ ట్రక్కు లోపల కాలిపోగా, బయట ఆగి ఉన్న ట్రక్కును రిపేర్ చేస్తున్న ట్రక్ డ్రైవర్, ఆపరేటర్‌తో సహా మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరిని పీబీఎం ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

సంఘటన గురించి సమాచారం అందుకున్న మహాజన్ పోలీస్ స్టేషన్, ఫైర్‌సిబ్బందికి కాల్ చేశారు. అగ్నిమాపక దళం రెండు ట్రక్కుల మంటలను అదుచేశారు. ప్రస్తుతం, పోలీసులు క్రేన్‌లను పిలిచి రెండు ట్రక్కులను తొలగించడానికి చర్యలు చేపట్టారు. అయితే, సంఘటనతో హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రెబల్ స్టార్ దెబ్బకు బాలీవుడ్ స్టార్స్ కూడా బిత్తరపోయారు..
రెబల్ స్టార్ దెబ్బకు బాలీవుడ్ స్టార్స్ కూడా బిత్తరపోయారు..
మెటర్నిటీ కవరేజ్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. లేకుంటే ఇబ్బందులు..
మెటర్నిటీ కవరేజ్ పొందాలంటే ఇవి తప్పనిసరి.. లేకుంటే ఇబ్బందులు..
నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే
నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా.? నిపుణులు ఏమంటున్నారంటే
మీ ఫోన్‌ స్టోరేజీ నిండిపోయిందా? ఈ ట్రిక్స్‌ ఉపయోగిస్తే ఖాళీ..
మీ ఫోన్‌ స్టోరేజీ నిండిపోయిందా? ఈ ట్రిక్స్‌ ఉపయోగిస్తే ఖాళీ..
దక్షిణాఫ్రికాతో ఫైనల్.. టాస్ గెలిచిన టీమిండియా..తుది జట్ల వివరాలు
దక్షిణాఫ్రికాతో ఫైనల్.. టాస్ గెలిచిన టీమిండియా..తుది జట్ల వివరాలు
అంబానీ, అదానీలపై అదనపు పన్ను.. ఓకే అన్న 74శాతం మంది పౌరులు..
అంబానీ, అదానీలపై అదనపు పన్ను.. ఓకే అన్న 74శాతం మంది పౌరులు..
పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..
పబ్బులో డీజే వాయించమంటే.. ఇదా మీరు చేసే గలీజు పని..
వర్షంలో మీ ఫోన్‌లోకి నీరు చేరిందా? ఈ తప్పులు చేయకుండా ఇలా చేయండి!
వర్షంలో మీ ఫోన్‌లోకి నీరు చేరిందా? ఈ తప్పులు చేయకుండా ఇలా చేయండి!
7నిమిషాల 4సెకన్ల పాత్రకు కమల్ హాసన్ అన్ని కోట్లు అందుకున్నాడా..!!
7నిమిషాల 4సెకన్ల పాత్రకు కమల్ హాసన్ అన్ని కోట్లు అందుకున్నాడా..!!
నల్లమల అడవుల్లో చిరుత హల్చల్.. బోనులో బంధించిన ఫారెస్ట్ అధికారులు
నల్లమల అడవుల్లో చిరుత హల్చల్.. బోనులో బంధించిన ఫారెస్ట్ అధికారులు