Watch: ఒక్క నిమిషం నిబంధన.. ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద సొమ్మసిల్లిన తల్లిదండ్రులు..

పోటీ పరీక్షాల టైమింగ్స్‌ విషయంలో అధికారులు సీరియస్‌గా ఉంటారు. పరీక్షల కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అభ్యర్థులను లోపలికి అనుమతించారు. అలాంటి సంఘటనలు అనేకం వార్తల్లో తరచూగా చూస్తూనే ఉంటాం. అయితే, అలాంటి ఘటనకు సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చి ఓ విద్యార్థిని తల్లిదండ్రుల ఆవేదన చూసి నెటిజన్లు సైతం వాపోయారు.

Watch: ఒక్క నిమిషం నిబంధన.. ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద సొమ్మసిల్లిన తల్లిదండ్రులు..
parents of UPSC aspirant break down
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2024 | 12:01 PM

గురుగ్రామ్‌లోని సెక్టార్ -47లో ఉన్న SD ఆదర్శ్ స్కూల్ ముందు జరిగిన ఒక దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ, ఆమె భర్త వెక్కివెక్కి ఏడుస్తూ కనిపించారు. వారితో పాటు వారి కూతురు కూడా ఉంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యేందుకు కూతురు వెళ్లిందని, అయితే ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదని చెబుతున్నారు. ఎంత ప్రయత్నించినా పాఠశాల అంగీకరించకపోవడంతో బాలిక తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సమయంలో విద్యార్థి తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది.

సమాచారం మేరకు విద్యార్థిని పరీక్షా కేంద్రానికి చేరుకోవడంలో కొంత ఆలస్యం చేశామని, అందుకే ఆమెకు ప్రవేశం ఇవ్వలేదని సమాచారం. వైరల్ అవుతున్న వీడియోలో, విద్యార్థి తల్లి గేటు వద్ద స్పృహతప్పి పడిపోయింది. తండ్రి ఏడుస్తూ కనిపించాడు. ఈ సమయంలో కుమార్తె అతనికి వివరిస్తూ, పప్పా ఎందుకు ఇలా చేస్తున్నారు.? నీళ్లు తాగండి, వచ్చేసారి పరీక్ష రాస్తాను కదా.? అని సర్ది చెబుతోంది. దీనికి ఆ తండ్రి ఒక ఏడాది వృధా అవుతుంది కదా అంటూ ఆవేదనగా అంటున్నాడు. దానికి ఆ కూతురు నో ప్రాబ్లమ్ అని చెప్పగా, టైమ్‌ పాస్‌ అనుకుంటున్నావా..అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆమె తల్లి కూడా ఇక్కడ్నుంచి కదిలేది లేదంటూ తేల్చి చెప్పింది.

ఇవి కూడా చదవండి

సాక్షి అనే యూజర్ ద్వారా X లో వీడియో షేర్ చేయబడింది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు హాజరయ్యేందుకు తమ కుమార్తెతో పాటు వచ్చిన తల్లిదండ్రుల పరిస్థితి హృదయ విదారక వీడియో అని వినియోగదారు క్యాప్షన్‌లో రాశారు. గురుగ్రామ్‌లోని సెక్టార్-47లోని ఎస్‌డి ఆదర్శ్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిని ఆలస్యంగా రావడంతో ఆమెను ఎగ్జామ్‌ హాల్‌లోకి అనుమతించలేదు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9 గంటలకే గేట్‌ను మూసివేశారనే విమర్శలు ఉన్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..