Chicken Biryani: ఎందుకొచ్చార్రా మీరంతా.. పెళ్లికి వచ్చి పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు.. బిర్యానీలో లెగ్ పీస్ లేదని..

బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు వడ్డించలేదని వధువు తరఫు కొందరు అతిథులు ఆరోపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది క్యాటరింగ్ సిబ్బంది, వరుడి కుటుంబ సభ్యులపై తీవ్రమైన వాదనలు, ఆరోపణలకు దారితీసింది. పరస్పరం కూర్చీలు ఎత్తుకుని మరీ కొట్టుకున్నారు. ఇరువురి బంధువులు ఆవేశంతో వరుడి కుటుంబీకులు పెళ్లికి నిరాకరించారు.

Chicken Biryani: ఎందుకొచ్చార్రా మీరంతా..  పెళ్లికి వచ్చి పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు.. బిర్యానీలో లెగ్ పీస్ లేదని..
Chicken Leg Pieces
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2024 | 12:53 PM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ జరగడంతో వివాహ వేడుక రణరంగంగా మారింది. బిర్యానీలో చికెన్ లెగ్ పీస్ మిస్ కావడంపై గొడవ జరిగినట్లు సమాచారం. పెళ్లికి హాజరైన అతిథులకు వడ్డించిన బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు పడలేదనే కోపంతో సంతోషకరమైన వివాహ వేడుక సమయంలో జరిగిన గొడవతో ఆ ప్రాంతం యుద్ధ భూమిగా మారింది. బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు వడ్డించలేదని పెళ్లికొడుకు తరఫు అతిథులు ఆరోపించడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో జరిగిన వివాహ వేడుకలో అతిథులకు వడ్డించిన బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు మిస్ అయ్యాయన్న ఆరోపణతో వదూవరుల బంధువులు ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల నడుమ తీవ్ర వాగ్వాదం చెలరేగడంతో సంతోషకరమైన సంఘట గందరగోళంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బిర్యానీలో చికెన్ లెగ్ పీస్‌లు వడ్డించలేదని వధువు తరఫు కొందరు అతిథులు ఆరోపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇది క్యాటరింగ్ సిబ్బంది, వరుడి కుటుంబ సభ్యులపై తీవ్రమైన వాదనలు, ఆరోపణలకు దారితీసింది. పరస్పరం కూర్చీలు ఎత్తుకుని మరీ కొట్టుకున్నారు. ఇరువురి బంధువులు ఆవేశంతో వరుడి కుటుంబీకులు పెళ్లికి నిరాకరించారు. కానీ, పెద్దలు సర్ధి చెప్పి ఒప్పించడంతో వధూవరుల కుటుంబ సభ్యులు రాజీకి వచ్చారు. వివాహ లాంఛనాలు పూర్తి చేయడానికి అనుమతించారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ ఘటనలో ఎవరి పేరు మీదా కేసు నమోదు కాలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. వీడియోలో, వివాహ వేడుకలో వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, కొట్టుకోవడం, కుర్చీలు విసురుకోవడం కనిపిస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..