Viral: గొంతు బొంగురు పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్.. లోపల

ఆస్ట్రియాకు చెందిన ఓ చైన్ స్మోక‌ర్ ప్ర‌స్తుత వ‌య‌సు 52 సంవత్సరాలు. త‌న‌ ఏజ్ 20 ఉన్నప్పటి నుంచి సిగ‌రెట్లు కాల్చ‌డం ప్రారంభించాడు. అంటే 1990 నుంచి 2007 వ‌ర‌కు రోజుకో సిగ‌రెట్ డ‌బ్బాను కాల్చేవాడు ఆ వ్య‌క్తి. ఈ క్ర‌మంలో అత‌నికి వింత ప‌రిస్థితి ఎదురైంది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Viral: గొంతు బొంగురు పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి.. టెస్టులు చేసిన డాక్టర్లు షాక్.. లోపల
Hair Inside Throat
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 27, 2024 | 9:42 PM

ధూమపానం చేయ్యొద్దురా బాబు అని ఎంతమంది మొత్తుకున్నా స్మోకర్స్ మాటవినరు. క్యాన్సర్ వంటి ప్రమాదరక వ్యాధులు అటాక్ చేస్తాయని.. లంగ్స్ పోతాయని.. డేటాతో చెప్పినా కేర్ చేయరు. అంతెందుకు సిగరెట్ పెట్టె మీద తాగొద్దు పోతారు అని రాసి ఉన్నా పట్టించుకోరు. ఇప్పటివరకు స్మోకింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని మన అందరికీ తెల్సు.. కానీ ఇక్కడ ఓ వ్యక్తి.. అసాధారణ సమస్యను ఎదుర్కొన్నాడు. ఈ వ్యక్తి గొంతు లోపల వెంట్రుకలు పెరిగాయి. ఈ షాకింగ్ ఘటన.. ఆస్ట్రియాలో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే..  ఈ వ్యక్తికి 1990ల నుంచే స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. అంటే మూడు దశాబ్దాలు సిగరెట్లు తగలేస్తూనే ఉన్నాడు. అయితే వయసు మీద పడుతున్న కొద్ది.. అతను గొంతు సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడ్డాడు. నిరంతరం.. దగ్గు, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఉండేవి. 2007లో వైద్యుడి వద్దకు వెళ్లగా.. టెస్టులు చేసిన డాక్టర్లు అతని గొంతులో వెంట్రుకలు మొలిచినట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. ఎండోట్రాషియల్ హెయిర్ గ్రోత్ అనే సమస్య బారిన పడ్డట్లు నిర్ధారించారు. అయితే స్మోకింగ్ మానేస్తేనే.. వాటి నుంచి విముక్తి లభిస్తుందని డాక్టర్లు చెప్పారు. కానీ ఆ స్మోకర్ మాత్రం.. తన అలవాటును మానుకోలేకపోయాడు. అప్పటినుంచి టెంపరరీ ఆ వెంట్రుకలను రిమూవ్ చేయించుకుంటున్నాడు. చివరకు ఆ ఇబ్బందిని భరించలేక.. సిగరెట్లు తాగడం మానెయ్యాలని డిసైడయ్యాడు. ఆ తరువాత డాక్టర్లు అతడి గొంతుకలోని వెంట్రుక కుదుళ్లను సర్జరీ ద్వారా రిమూవ్ చేశారు. అయితే అతని గొంతులోకి వెంట్రుకలు మొలవడానికి.. స్మోకింగ్ కారణమా అంటే..? డాక్టర్లు మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవును అంటుంటే.. మరికొందరు కాదని.. అందుకు ఆస్కారమే లేదంటున్నారు.

అయితే బాధితుడికి 10 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు.. గొంతు కింది భాగంలో గాయ‌మైంది. దీంతో అక్క‌డ స‌ర్జ‌రీ( ట్రాకియోటమీ) నిర్వ‌హించారు. ఆ స‌ర్జ‌రీ చేసిన భాగం నుంచే వెంట్రుక‌లు పెరిగినట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?