Viral Video: ఓర్నీ.. నిద్రపోతున్న బాలుడి డ్రాయర్‌లోకి దూరిన పాము.. ఆ తర్వాత..

ఇప్పుడు రెయినీ సీజన్ నడుస్తోంది. పాములు ఇళ్లలోకి వచ్చి... ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లు, మంచాలు, షూలు.. ఇలా ఎక్కడ పడితే అక్కడకి చేరి షాక్ ఇస్తూ ఉంటాయి. అలాంటి పాముకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఓర్నీ.. నిద్రపోతున్న బాలుడి డ్రాయర్‌లోకి దూరిన పాము.. ఆ తర్వాత..
Snake News
Follow us

|

Updated on: Jun 27, 2024 | 9:04 PM

పాములకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అసలే వర్షాకాలం. పాములు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. అవి ఎక్కడ దూరతాయో తెలీదు. బైక్స్‌, కారుల్లో పాములు దూరిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. కొన్నిసార్లు  అయితే చెప్పులు, షూలలో కూడిన నక్కిన దాఖలాలు ఉన్నాయి. అప్రమత్తంగా లేకపోతే పాము కాటు పడుతుందండోయ్. అయితే.. ఇక్కడ ఓ విచిత్రమైన ఘటన వెలుగుచూసిందండోయ్. పాము ఏకంగా నిద్రిస్తున్న బాలుడి డ్రాయర్‌లోకి దూరేసింది. థాయ్‌లాండ్‌లోని రేయోంగ్‌ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అప్పటివరకు ఘాడమైన నిద్రలో ఉన్న బాలుడు.. ఏదో పాకుతున్నట్లు అనిపించి.. చూడగా.. పాము కనిపించడంతో బిత్తరపోయాడు. అయితే.. భయంతో వణికిపోతున్నా.. కదిలితే కాటు వేస్తుందేమో అని అలాగే ఉండిపోయాడు. గట్టిగా అరవడంతో.. ఇంట్లోని వారు పరుగున వచ్చారు.

ఏం చేయాలో పాలుపోక స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. చాలా జాగ్రత్తగా డ్రాయర్ నుంచి పామును బయటకు తీశాడు. పాము కాటు వేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది. ఒరెయ్.. నువ్వు మస్త్ లక్కీ ఫెల్లోవి.. పాముతో ఇలాంటి ఎన్‌కౌంటర్ నెవర్ బిఫోర్… అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియోకు ప్రస్తుతం 80 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి.