AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. బౌండరీ లైన్‌లో బాపూ మ్యాజిక్ వీడియో మీకోసం..!

Axar Patel Shivam Dube Relay Catch Video: వాంఖడేలో జరిగిన హై ఓల్టేజ్ పోరులో భారత జట్టు ఉత్కంఠ విజయంతో ఫైనల్ చేరుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌లో బాపూ తీసుకున్న క్యాచ్ వీడియో మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది.

Video: మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ మిస్సయ్యారా.. బౌండరీ లైన్‌లో బాపూ మ్యాజిక్ వీడియో మీకోసం..!
Ind Vs Eng Axar Patel Catch Video
Venkata Chari
|

Updated on: Mar 06, 2026 | 8:03 AM

Share

Axar Patel Shivam Dube Relay Catch Video: టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు (India national cricket team) జట్టు ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్ (England national cricket team) పై ఉత్కంఠ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫీల్డింగ్ అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) చూపించిన పరిణితి తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఈ మ్యాచ్ లో అక్షర్ పట్టిన రెండు క్యాచ్ లు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా శివం దుబే (Shivam Dube)తో కలిసి బాపూ తీసుకున్న రిలే క్యాచ్ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.

అక్షర్ పటేల్ అద్భుత ప్రయత్నం..

భారత్ బౌలర్ అర్షదీప్ సింగ్ (Arshdeep Singh) వేసిన బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ విల్ జాక్స్ (Will Jacks) బలంగా షాట్ ఆడాడు. బంతి స్వీపర్ కవర్ వైపు ఎత్తుగా వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ ఎడమ వైపు దూరం పరుగెత్తి బంతిని అందుకున్నాడు.

అయితే, అతని వేగం కారణంగా బౌండరీ రోప్ దాటే పరిస్థితి ఏర్పడింది. వెంటనే తెలివిగా బంతిని మైదానంలోకి తిరిగి విసిరాడు.

శివమ్ దూబే పూర్తి చేసిన క్యాచ్..

అక్షర్ విసిరిన బంతిని లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చిన శివం దుబే (Shivam Dube) అద్భుతంగా పట్టుకుని క్యాచ్ పూర్తి చేశాడు. ఈ రిలే క్యాచ్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

భారత్ ఫైనల్‌లోకి..

ఈ సెమీఫైనల్ విజయం తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫైనల్‌లో భారత జట్టు న్యూజిలాండ్ (New Zealand national cricket team) తో తలపడనుంది.

ఇంగ్లాండ్‌పై వరుసగా రెండో సెమీఫైనల్ విజయం..

ఇది వరుసగా రెండోసారి భారత్ ఇంగ్లాండ్‌ను సెమీఫైనల్‌లో ఓడించిన సందర్భం. ముందుగా 2024 టీ20 వరల్డ్ కప్‌లో కూడా భారత్ ఇంగ్లాండ్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us