Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: బిహార్‌లో కూలిన మరో వంతెన.. 10 రోజుల వ్యవధిలో నాలుగోది..

గత పది రోజుల్లో బీహార్‌లోని అరారియాలో రెండు చోట్ల, శివాన్‌లో ఒక చోట బ్రిడ్జి కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ప్రజా మౌలిక సదుపాయాల నాణ్యతపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజుల్లో సివాన్, అరారియా జిల్లాల్లో వంతెనలు కుప్పుకూలిన సంగతి తెలిసిందే.

Bihar: బిహార్‌లో కూలిన మరో వంతెన.. 10 రోజుల వ్యవధిలో నాలుగోది..
Bridge Collapse
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2024 | 6:57 AM

బీహార్‌లో మరో బ్రిడ్జి కూలింది. బీహార్‌లోని కిషన్‌ గంజ్‌ జిల్లాలో గురువారం ఒక వంతెన కూలిపోయింది. కేవలం 10 రోజుల వ్యవధిలో ఇది నాలుగవ సంఘటన కావడంతో నిర్మాణ పనుల నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా నీటి మట్టాలు పెరగడంతో కిషన్‌గంజ్‌ జిల్లా బహదూర్‌ గంజ్‌ బ్లాక్‌లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పున ఉన్న బ్రిడ్జికి ఇటీవల మరమ్మతులు ప్రారంభించారు. 2011లో నిర్మించిన ఈ బ్రిడ్జి కంకాయ్‌ నదిని, మహానందతో కలుపుతుంది. మడియాలోని ఈ బ్రిడ్జి పలువురు గిరిజనులకు ఉపయోగపడేది.

13 ఏళ్ల క్రితం గ్రామీణ పనుల విభాగం రూ. 25 లక్షల వ్యయంతో ఈ 70 మీటర్లు పొడవుతో ఈ వంతెన నిర్మాణం జరిగింది. ఇక ఈ నిర్మాణం పూర్తయి.. ప్రారంభించిన 6 సంవత్సరాలకే వంతెన దెబ్బతినడంతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ క్రమంలోనే వంతెన కూలిపోయింది.. ఈ వంతెన కూలిపోవడం అవినీతి ఎంత ప్రబలంగా ఉందనేందుకు నిదర్శనమని వారు స్పష్టం చేశారు. అంతేకాదు మరో కొత్త వంతెనను నిర్మించాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

నేపాల్‌ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హఠాత్తుగా నదిలో నీటిమట్టం పెరిగింది. అందులో ఒక పిల్లర్‌ ప్రవాహ ఉద్ధృతికి పడిపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. గత పది రోజుల్లో బీహార్‌లోని అరారియాలో రెండు చోట్ల, శివాన్‌లో ఒక చోట బ్రిడ్జి కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదల కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, ప్రజా మౌలిక సదుపాయాల నాణ్యతపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

గత వారం రోజుల్లో సివాన్, అరారియా జిల్లాల్లో వంతెనలు కుప్పుకూలిన సంగతి తెలిసిందే. మరోవైపు.. కూలిన వంతెన అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది