Ragging: జవహర్‌ నవోదయలో ర్యాగింగ్‌ భూతం.. ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులపై సస్పెండ్‌ వేటు!

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చంగ్‌లాంగ్‌ జిల్లాలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్‌ చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ర్యాగింగ్‌ చేశారు. విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో వారి వీపు, కాళ్లపై కమిలిన గుర్తులు కనిపించాయి. మంగళవారం జవహర్ నవోదయ విద్యాలయంలోని 8వ తరగతి విద్యార్థులు క్లాసులు ముగిసిన తర్వాత భోజనం చేస్తుండగా 11వ తరగతి విద్యార్థులు..

Ragging: జవహర్‌ నవోదయలో ర్యాగింగ్‌ భూతం.. ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులపై సస్పెండ్‌ వేటు!
Students Ragging
Follow us

|

Updated on: Jun 27, 2024 | 9:09 PM

చంగ్‌లాంగ్‌, జూన్‌ 27: అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో దాదాపు15 మంది విద్యార్థులను అదే స్కూల్‌లోని సీనియర్లు దారుణంగా ర్యాగింగ్‌ చేశారు. ర్యాగింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో బాధిత విద్యార్ధుల శరీరాలపై గాయాల గుర్తులు చూసి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని చంగ్‌లాంగ్‌ జిల్లాలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయలో ర్యాగింగ్‌ చోటుచేసుకున్నది. 8వ తరగతి విద్యార్థులను 11వ తరగతి చదువుతున్న విద్యార్ధులు ర్యాగింగ్‌ చేశారు. విద్యార్థులను తీవ్రంగా కొట్టడంతో వారి వీపు, కాళ్లపై కమిలిన గుర్తులు కనిపించాయి. మంగళవారం జవహర్ నవోదయ విద్యాలయంలోని 8వ తరగతి విద్యార్థులు క్లాసులు ముగిసిన తర్వాత భోజనం చేస్తుండగా 11వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో విద్యార్థులపై శారీరకంగా చిత్రహింసలు పెడుతున్న ఘటనలు వెలుగులోకి తెచ్చారు. చాలా మంది విద్యార్థులకు వీపు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం.. ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు. వారిని వెంటనే సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాజీవ్ రంజన్ తెలిపారు. అదే విషయమై విద్యార్థుల పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించి, వారితో చర్చించిన అనంతరం నిందితులపై తదుపరి చర్యలకు తీసుకుంటామని తెలిపారు. అయితే బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు మాత్రం వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తదుపరి చర్యలపై చర్చించేందుకు పాఠశాల పేరెంట్ టీచర్ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరగనుందని రంజన్ తెలిపారు. జవహర్‌ నవోదయ పాఠశాలలో 530 మంది విద్యార్థులు ఉండగా.. 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles