Kallakurichi Hooch Tragedy: కల్తీ మద్యం ఘటనలో 63కి పెరిగిన మృత్యుల సంఖ్య.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఏఐఏడీఎంకే డిమాండ్‌

తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనతో రాష్ట్రం రావణకాష్ఠలా రగిలిపోతుంది. తాజాగా మరో ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ కల్తీసారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కు పెరిగింది. మరో 78 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో ప్రాణాలతో..

Kallakurichi Hooch Tragedy: కల్తీ మద్యం ఘటనలో 63కి పెరిగిన మృత్యుల సంఖ్య.. కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఏఐఏడీఎంకే డిమాండ్‌
Kallakurichi Hooch Tragedy
Follow us

|

Updated on: Jun 27, 2024 | 8:51 PM

చెన్నై, జూన్‌ 27: తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనతో రాష్ట్రం రావణకాష్ఠలా రగిలిపోతుంది. తాజాగా మరో ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ కల్తీసారా ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 63కు పెరిగింది. మరో 78 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నైలో అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు గురువారం నిరాహారదీక్ష చేపట్టారు. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే నేతలు నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఏఐఏడీఎంకే సీనియర్‌ నేత సి పొన్నయన్‌ మాట్లాడుతూ.. ‘స్టాలిన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్నదే మా డిమాండ్‌. కేవలం డీఎంకే కార్యకర్తలే కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలతో చలగాటం అడుతున్నారు. నిషేధిత డ్రగ్స్ దురాగతాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న వారికి స్టాలిన్, అతని ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఏఐఏడీఎంకే నేత డి జయకుమార్ మాట్లాడుతూ.. ‘దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. సీబీఐకి అప్పగించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. డీఎంకే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం మాకు ఇవ్వడం లేదు. ఇది తమిళనాడు బర్నింగ్ ఇష్యూ’ అని పేర్కొన్నారు. కాగా ఏఐఏడీఎంకే నేత, ప్రతిపక్ష నేత (ఎల్‌ఓపీ) ఎడప్పాడి పళనిస్వామి, ఇతర సీనియర్ నేతలు సమ్మెలో పాల్గొంటున్నారు.

మరోవైపు కల్తీ మద్యం ఘటనపై ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్‌ వేటు పడింది. అసెంబ్లీ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఆ పార్టీ ఎమ్మెల్యేల‌పై స‌స్పెన్షన్ విధించారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకుంటున్నారన్న నెపంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌ను స‌భా నుంచి పంపించివేయాలంటూ త‌మిళ‌నాడు స్పీక‌ర్ ఎం అప్పవు ఆదేశించారు. కళ్లకురిచి జిల్లా కలెక్టరేట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం.. బుధవారం సాయంత్రం నాటికి హూచ్ విషాదంలో మరణించిన వారి సంఖ్య 63 కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో మొత్తం 78 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 48 మంది కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరగా, 66 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
'మన్ కీ బాత్'ద్వారా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
'మన్ కీ బాత్'ద్వారా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
నిద్రపోతున్న యువకుడిషార్ట్‌‌లో దూరిన పాము..ఆ తరువాతజరిగిందిచూస్తే
నిద్రపోతున్న యువకుడిషార్ట్‌‌లో దూరిన పాము..ఆ తరువాతజరిగిందిచూస్తే
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
మీ ఆరోగ్య రహస్యాన్ని మీ గోర్లే చెబుతాయి తెలుసా..?
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
Video: డ్రీమ్ ట్రోఫీ చేతికందగానే ద్రవిడ్ రియాక్షన్ చూస్తే పూనకాలే
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
మోదీ 3.Oలో తొలి మన్‌ కీ బాత్‌.. ప్రధాని ఏం చెప్పారంటే..
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
చదివిందెమో ఇంజనీరింగ్.. చేసేదెమో గలీజ్ దందా..!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
18ఏళ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముడు.. ఇన్‌స్టా రీల్‌ కలిపింది!
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
ఆర్మీలో చేరాలనుకున్న అమ్మాయి హీరోయిన్ అయ్యింది..
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
విద్యార్థుల ప్రేమకు భావోద్వేగానికి లోనైన టీచర్.. ఏం చేశారంటే!
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్
Video: ఇది కదా ఆనందమంటే.. భాంగ్రా స్టెప్పులేసిన కోహ్లీ, అర్షదీప్