Vastu Tips: అప్పులతో తిప్పలా, ఆర్ధికాభివృద్ధి కోసం ఈ వాస్తు నియమాలను పాటించి చూడండి..

ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు.. అద్దె ఇంట్లో కూడా వాస్తు నియమాలు పాటిస్తారు. వాస్తు ప్రకారం అద్దె ఇంటికి వెళ్ళేవారు కూడా ఉన్నారు. వాస్తు పండితులు ప్రకారం, వాస్తు దోషాలు ఆరోగ్య సంబంధిత సమస్యలను మాత్రమే కాదు ఆర్థిక సమస్యలను కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా ఇంట్లోని కొన్ని లోపాలు ఆర్థిక వృద్ధిని (ఆర్థిక సమస్యలు) నిరోధిస్తాయని, అప్పులు వెంటాడుతాయని చెబుతారు. అప్పుల భారం తగ్గడానికి, ఆర్థికంగా ఎదగడానికి ( జ్యోతిష్యం, ఆధ్యాత్మికం )వాస్తు నియమాలను ఎలా పాటించాలో ఈ రోజు తెలుసుకుందాం..

Vastu Tips: అప్పులతో తిప్పలా, ఆర్ధికాభివృద్ధి కోసం ఈ వాస్తు నియమాలను పాటించి చూడండి..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 28, 2024 | 8:51 AM

ప్రపంచంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు దానిని అనుసరించే వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో వాస్తును ఎక్కువగా నమ్మేవారున్నారు. వాస్తు లేని ఇంటిని చూడలేమని చెప్పవచ్చు. కనుక ఇంటి నిర్మాణంలో మాత్రమే కాదు.. అద్దె ఇంట్లో కూడా వాస్తు నియమాలు పాటిస్తారు. వాస్తు ప్రకారం అద్దె ఇంటికి వెళ్ళేవారు కూడా ఉన్నారు. వాస్తు పండితులు ప్రకారం, వాస్తు దోషాలు ఆరోగ్య సంబంధిత సమస్యలను మాత్రమే కాదు ఆర్థిక సమస్యలను కూడా కలిగిస్తాయి. ముఖ్యంగా ఇంట్లోని కొన్ని లోపాలు ఆర్థిక వృద్ధిని (ఆర్థిక సమస్యలు) నిరోధిస్తాయని, అప్పులు వెంటాడుతాయని చెబుతారు. అప్పుల భారం తగ్గడానికి, ఆర్థికంగా ఎదగడానికి ( జ్యోతిష్యం, ఆధ్యాత్మికం )వాస్తు నియమాలను ఎలా పాటించాలో ఈ రోజు తెలుసుకుందాం..

  1. ఇంట్లో ఈశాన్య దిక్కు చాలా ముఖ్యం. కనుక ఈ దిశ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈశాన్య మూలను వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతారు. ఈ దిశలో బరువైన వస్తువులు, చెత్త డబ్బాలు, చెప్పులు పెట్టకూడదు.
  2. గోడలకు వేసే రంగుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వీలైనంత ఎక్కువగా లేత రంగులు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో ఉండే రంగులు మనిషి మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని చెబుతారు.
  3. ఇంట్లో ఆగ్నేయ దిశ కూడా చాలా ముఖ్యం. ఈ దిశను సంపద మూల అంటారు. ఈ దిశలో ఉంచే కొన్ని వస్తువులు సంపదను ఆకర్షిస్తాయి. అందుకే సౌత్ ఈస్ట్ లో మనీ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల మంచి జరుగుతుందని, అప్పుల బాధలు తగ్గుతాయని, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో పేర్కొంది.
  4. వ్యాపార, వృత్తిలో పురోగతి సాధించాలంటే ఉత్తరం వైపు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో, కెరీర్‌లో విజయాన్ని సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే కిటికీలు, తలుపులు ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ దిశ నుంచి ఇంట్లోకి వెలుతురు, గాలి వచ్చేలా చూసుకోవాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఇంట్లో పెట్టుకున్న కొన్ని వస్తువులు ఐశ్వర్యాన్ని కలిగిస్తాయని వాస్తు పండితులు అంటున్నారు. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధ, తాబేలు వంటి విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా మార్పు కనిపిస్తుందని అంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.