Watch: ఏం అదృష్టం..! పిల్లి పిల్లకు బారసాల..పూలపై నడిపిస్తూ పండగ.. బ్యూటీ బ్రాండ్ ఆఫీస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌

వైరల్ వీడియోలో పిల్లి బీన్ బ్యాగ్‌లో హాయిగా నిద్రపోతున్న దృశ్యం కూడా కనిపించింది. అందరూ దానిని తమ ఫోన్‌లతో ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారు. పిల్లి పిల్ల ఆఫీసు అంతటా తిరుగుతూ, తింటున్న దృశ్యాలను కూడా అక్కడున్న వారు వీడియో తీశారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. పోస్ట్ కామెంట్ బాక్స్‌లో నెటిజన్ల ప్రశంసలు, కామెంట్లతో నిండిపోయింది.

Watch: ఏం అదృష్టం..! పిల్లి పిల్లకు బారసాల..పూలపై నడిపిస్తూ పండగ.. బ్యూటీ బ్రాండ్ ఆఫీస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌
Cat Naming Ceremony
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2024 | 8:23 AM

జంతుప్రేమికులు చాలా మంది తమ పెట్ యానిమల్స్‌ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. వాటికి పుట్టిన రోజులు, బారసాల, సీమంతం ఇలా ప్రతి సందర్భాన్ని సంతోషంగా వేడుకగా జరుపుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. పూణేలోని ఓ ప్రైవేటు కంపెనీ కార్యాలయంలో ఒక చిన్ని పిల్లి పిల్లకు నామకరణ వేడుక అట్టహాసంగా జరిపించారు. తోటెల్లో వేసి ఊపుతూ పేరుపెట్టారు.. చివర్లో కేక్‌ కూడా కట్‌ చేశారు. పిల్లి చుట్టూ బంధుమిత్రుల కోలాహలంగా మారింది. ఈ అందమైన క్షణాల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కాగా, ఈ స్వీట్ వీడియోలు సోషల్ మీడియా పేజీల్లో చక్కర్లు కొడుతున్నాయి.

పూణెలోని ఓ బ్యూటీ బ్రాండ్ కార్యాలయంలో ఇలాంటి వేడుక జరిగింది. అక్కడ కొత్త సభ్యుడు పిల్లికి ఘనంగా స్వాగతం పలికారు. హిందూ సంప్రదాయం ప్రకారం పిల్లికి నామకరణ వేడుకలు నిర్వహించారు. వీడియో ప్రారంభంలో ఒక మహిళ ఒడిలో తెలుపు, పసుపు రంగుతో ఉన్న బుల్లి పిల్లిపిల్ల కనిపిస్తుంది. దానికి ఎదురుగా పళ్ళెంలో పూలు, దీపాలు కూడా వెలిగించారు. ఆ పిల్లి నుదుటిపై తిలకం కూడా దిద్దారు. మంగళహారతులిస్తూ.. పూలు చల్లుతూ ఆఫీసులోకి స్వాగతం పలుకుతూ లోపలికి తీసుకువచ్చారు. దాని అడుగుల కింద పూ రేకులు చల్లుతూ వాటిపై నడిపించారు. ఆ తర్వాత పిల్లికి నామకరణ కార్యక్రమం కూడా జరిగింది.

ఇవి కూడా చదవండి

హిందూ నామకరణ సంప్రదాయాన్ని అనుసరించి, పిల్లి పిల్లను ఒక షీట్‌లో వేసి ఊపుతూ.. దాని చెవిలో ‘కోకాయ’ అనే పేరుతో పిలిచారు. ఆ మహిళ పిల్లి చెవిలో పేరు చెబుతుంటే.. అక్కడున్న వారంతా ఆమె విపుపై కొడుతూ సందడి చేశారు..ఇది మన అందరి ఇళ్లలో పుట్టిన పిల్లలకు పేరు పెట్టే సందర్భంగా అచ్చం ఇలాగే చేస్తారు. అదే తంతు ఈ పిల్లి పిల్లకు కూడా చేశారు. అయితే ఇది ఇక్కడితో పూర్తి కాలేదు…ఆ తరువాత పిల్లి చేతితో చాక్లెట్ కేక్ కూడా కట్ చేయించారు. ఆపై ఆ బుల్లి పిల్లి ఆఫీస్‌ అంతా చక్కర్లు కొట్టింది. ల్యాప్‌టాప్‌పై కూడా అడుగులు వేసింది. ఒకరి భుజం మీద ఎక్కి కూర్చుంటుంది.

వైరల్ వీడియోలో పిల్లి బీన్ బ్యాగ్‌లో హాయిగా నిద్రపోతున్న దృశ్యం కూడా కనిపించింది. అందరూ దానిని తమ ఫోన్‌లతో ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారు. పిల్లి పిల్ల ఆఫీసు అంతటా తిరుగుతూ, తింటున్న దృశ్యాలను కూడా అక్కడున్న వారు వీడియో తీశారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. పోస్ట్ కామెంట్ బాక్స్‌లో నెటిజన్ల ప్రశంసలు, కామెంట్లతో నిండిపోయింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ