Ajith: గాల్లో పల్టీలు కొడుతున్న కార్లో స్టార్ హీరో.. వీడియో చూసి షాక్‌లో ఫ్యాన్స్.!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో అజిత్ చాలా ప్రత్యేకం. ఇప్పటికీ సొంతంగా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో. అలాగే సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ.. తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ లైఫ్ ప్రశాంతంగా గడుపుతున్నాడు. అలాగే ఇటు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతోనూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది తునీవు సినిమాతో పలకరించిన అజిత్..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్ హీరోలందరిలో అజిత్ చాలా ప్రత్యేకం. ఇప్పటికీ సొంతంగా ఫోన్ ఉపయోగించని ఏకైక హీరో. అలాగే సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ.. తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ లైఫ్ ప్రశాంతంగా గడుపుతున్నాడు. అలాగే ఇటు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతోనూ అలరిస్తున్నాడు. ఈ ఏడాది తునీవు సినిమాతో పలకరించిన అజిత్… ఇప్పుడు విదా ముయర్చి సినిమాలో నటిస్తున్నాడు. కొన్నాళ్లుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ కోసం అజిత్ తన ప్రాణాలనే పణంగా పెడుతున్నాడు. గతంలో విదాముయర్చి యాక్షన్ సీన్ కోసం స్వయంగా కారు నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు అజిత్. ఇక ఇప్పుడు అలాంటి ఫీటే చేసి.. తన డేరింగ్ నెస్.. రిస్క్ చేసే యాటిట్యూడ్ తో అందర్నీ షాకయ్యేలా చేస్తున్నాడు.
ఇక రీసెంట్‌గా విదాముయర్చి సినిమా యాక్షన్ సీన్ షూటింగ్ వీడియోను పంచుకుంది చిత్రయూనిట్. ఆ వీడియోలో కారును క్రేన్ సహాయంతో గాల్లోకి లేపారు. కారు గాల్లో ఉన్నప్పుడు అందులో హీరో అజిత్ తోపాటు.. మరో నటుడు ఆరవ్ కూడా ఉన్నారు. క్రేన్ సాయంతో గాల్లోకి లేపిన తర్వాత అక్కడే కొన్ని పల్టీలు కొట్టించారు. ఆ సమయంలోనూ ఇద్దరూ స్టార్స్ కార్లోనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇలాంటి రిస్కీ షాట్స్ చేయడం చాలా ప్రమాదకరం. అందులోనూ స్టార్ హీరో ఎలాంటి డూప్ సాయం లేకుండా అదే కారులో ఉండడం చూసి చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.