AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapna Shastra: పై నుంచి పడిపోతున్నట్లు కలగంటున్నారా.. ఈ హెచ్చరిక కావచ్చు.. జాగ్రత్తగా ఉండండి

కల గుర్తుకొచ్చి మళ్లీ ఆశ్చర్యపోతారు. కొందరు నిద్రలోనే భయంతో అరుస్తారు కూడా.. పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మందికి రాత్రి నిద్రిస్తున్న సమయంలో రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని కలలు భవిష్యత్తు గురించి విభిన్న సూచనలను ఇస్తుందని.. స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ నేపధ్యంలో ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయినట్లు కలలు కనడం శుభామా లేదా అశుభమా. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ భయంకరమైన కలకు అర్ధం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Swapna Shastra: పై నుంచి పడిపోతున్నట్లు కలగంటున్నారా.. ఈ హెచ్చరిక కావచ్చు.. జాగ్రత్తగా ఉండండి
Swapna Shastra
Surya Kala
|

Updated on: Jun 28, 2024 | 10:07 AM

Share

ప్రతి ఒక్కరూ నిద్ర పోవడం ఆ నిద్రలో కలలు కనడం సర్వసాధారణం. ఈ కలలు రకరకాల సంఘటనలు, పక్షులు, జంతువులు కనిపిస్తాయి. ఇలా కనిపించే ప్రతి ఒక్క కలకు ఒకొక్క అర్ధం ఉందని స్వప్న శాస్త్రం వెల్లడించింది. అలాంటి కలల్లో కొన్ని భయంకరంగా ఉంటాయి. గాఢనిద్రలో ఎత్తైన పర్వతం నుండి లేదా ఎక్కడో నుండి పడిపోతున్నట్లు.. పైకి లేవలేక పడిపోతున్నట్లు అనిపిస్తుంది. అంతే కాదు ఒక్కోసారి ఆకాశం నుంచి అప్పుడప్పుడూ చీకటి బావి అడుగున, సముద్రపు నీళ్ల లో పడినట్లు నిద్రలో కలగంటారు. ఎవరికైనా నిద్రలో ఇలాంటి భయంకరమైన కల కనిపిస్తే.. కొన్నిసార్లు హటాత్తుగా మేల్కొంటారు. కల గుర్తుకొచ్చి మళ్లీ ఆశ్చర్యపోతారు. కొందరు నిద్రలోనే భయంతో అరుస్తారు కూడా.. పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మందికి రాత్రి నిద్రిస్తున్న సమయంలో రకరకాల కలలు వస్తుంటాయి. కొన్ని కలలు భవిష్యత్తు గురించి విభిన్న సూచనలను ఇస్తుందని.. స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ నేపధ్యంలో ఎత్తైన ప్రదేశం నుండి పడిపోయినట్లు కలలు కనడం శుభామా లేదా అశుభమా. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ భయంకరమైన కలకు అర్ధం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

కలలో కాలు జారి పడినా.. లేదా అనుకోకుండా పడిపోయినా ఇది స్వప్న శాస్త్రం ప్రకారం మంచి కలగా పరిగణించబడదు. సన్నిహితులు లేదా బంధువులలో ఒకరు మీకు ద్రోహం చేయవచ్చని ఈ కలకు అర్థం. కనుక నిద్రలో అలాంటి కల వస్తే జాగ్రత్తగా ఉండండి.

వినడానికి కాస్త వింతగా అనిపించినా.. చాలా మంది ఆకాశం నుంచి నేలపై పడుతున్నట్లు కలలు కంటారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం ఈ కల అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇలాంటి కలకు అర్ధం సమీప భవిష్యత్తులో అసహ్యకరమైన సంఘటన జరగబోతుందని.. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని అర్ధం.

ఇవి కూడా చదవండి

నిద్రలో పర్వతం నుంచి పడిపోతున్నట్లు కలలుగన్నట్లయితే.. అది కూడా అశుభ సంకేతమే. ఇలాంటి కల కంటే రాబోయే సంక్షోభానికి సిద్ధం కావడం తప్ప మరో మార్గం లేదు. కనుక ఇలాంటి కల కంటే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఇంటి పైకప్పు నుండి పడుతున్నట్లు కల గంటే స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కల భవిష్యత్తులో కుటుంబ కలహాలను సూచిస్తుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబంలో సామరస్యాన్ని సృష్టించడానికి ప్రయత్నించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.