Viral Video: ఈ ఇడ్లీ కాస్టిలీ గురూ.. ఒక ప్లేట్ ఇడ్లీ ధర రూ. 500.. ఎందుకు ఇంత ధర అంటే..

వేడి వేడి ఇడ్లిని ఇంట్లో తినడమే కాదు హోటళ్లలో రూ.30 నుంచి రూ.50 మధ్య వేడి వేడి ఇడ్లీని రకరకాల చట్నీలతో ఆస్వాదించవచ్చు. అయితే చెన్నైలోని ఒక హోటల్‌లో ప్లేట్ ఇడ్లీకి సుమారు 500 రూపాయలు చెల్లించాలి. అయితే ప్లేట్ ఇడ్లీ ఎందుకు అంత ఖరీదు? ఈ ఇడ్లీ ప్రత్యేకత ఏమిటి? ఈ రోజు తెలుసుకుందాం..

Viral Video: ఈ ఇడ్లీ కాస్టిలీ గురూ.. ఒక ప్లేట్ ఇడ్లీ ధర రూ. 500.. ఎందుకు ఇంత ధర అంటే..
Rs 500 Special Idli
Follow us

|

Updated on: Jun 28, 2024 | 9:27 AM

ఉదయం అల్పాహారం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో మార్నింగ్ టిఫిన్ గా ఇడ్లీ సాంబార్ తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతారు. అంతేకాదు ఇడ్లీ రుచికరమైన అల్పాహారం. తక్కువ ధరకే దొరుకుతుంది. వేడి వేడి ఇడ్లిని ఇంట్లో తినడమే కాదు హోటళ్లలో రూ.30 నుంచి రూ.50 మధ్య వేడి వేడి ఇడ్లీని రకరకాల చట్నీలతో ఆస్వాదించవచ్చు. అయితే చెన్నైలోని ఒక హోటల్‌లో ప్లేట్ ఇడ్లీకి సుమారు 500 రూపాయలు చెల్లించాలి. అయితే ప్లేట్ ఇడ్లీ ఎందుకు అంత ఖరీదు? ఈ ఇడ్లీ ప్రత్యేకత ఏమిటి? ఈ రోజు తెలుసుకుందాం..

ఇంత ఖరీదైన ఇడ్లీ చెన్నైలోని అడయార్ ఆనంద భవన్ హోటల్‌లో లభిస్తుంది. ఈ ఇడ్లీ ఇంత ఖరీదుకి కారణం దీని తయారీలో ఉపయోగించే పదార్థాలే కారణం. బాదం, బ్లూబెర్రీస్, ఆలివ్ ఆయిల్ సహా అనేక ఇతర పదార్థాలను ఉపయోగిస్తారు. అంటే ఈ ఇడ్లిని పుట్టగొడుగులు, బ్రెజిల్ నట్, ఒమేగా 3 – అవిసె గింజలు, అల్లం పొడి, అశ్వగంధ సారం, 24 గంటలు నానబెట్టిన బాదం, వాల్‌నట్‌లు, పిస్తా, జీడిపప్పు, బ్లూబెర్రీస్, ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, అవకాడో, లవంగం, దాల్చినచెక్క మొదలైన పోషకాలు అధికంగా ఉండే పదార్థాలతో తయారు చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ ఇడ్లీని నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చు. ఇలా ఇడ్లీని తయారు చేసే సమయంలో రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందులో వాడే ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఉపయోగపడుతుంది. బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాల కారణంగా వీటిని కూడా ఉపయోగిస్తారు.

ఈ ప్రత్యేక ఇడ్లీ యొక్క వీడియో Instagram ఖాతా @foodtastingmission లో షేర్ చేశారు. జూన్ 21న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..