బాబోయ్..స్మోకింగ్ వల్ల శరీరంలోని ఈ భాగంలో జుట్టు పెరుగుతుంది..! తెలిస్తే నోరెళ్ల బెడతారు..

ఆస్ట్రియాలో నివసిస్తున్న 52 ఏళ్ల వ్యక్తి చైన్ స్మోకర్. అతను 1990 నుండి ధూమపానం చేస్తున్నాడు. ఈ ధూమపానం వల్ల అతనికి గొంతు సమస్యలు మొదలయ్యాయి. అతను సరిగ్గా ఏమీ తినలేడు, తాగలేడు. అతని గొంతు కూడా గద్గదంగా మారింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి దగ్గు మొదలైంది. అతనికి 2006 సంవత్సరం నుండి ఈ సమస్యలు మొదలయ్యాయి.

బాబోయ్..స్మోకింగ్ వల్ల శరీరంలోని ఈ భాగంలో జుట్టు పెరుగుతుంది..! తెలిస్తే నోరెళ్ల బెడతారు..
smoking
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2024 | 9:19 AM

స్మోకింగ్ వల్ల క్యాన్సర్ సమస్య వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.! సినిమా హాల్లో సినిమా ప్రారంభానికి ముందు ఓ ప్రకటనలో అక్షయ్ కుమార్ స్మోకింగ్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తాడు. కానీ ఈ ఆస్ట్రియన్ వ్యక్తికి ఏం జరిగిందో ఎవరూ చెప్పలేరు. ధూమపానం ఈ వ్యక్తికి తీవ్రమైన బాధను కలిగించింది. స్మోకింగ్‌ వల్ల ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి తన శరీరంపై అతను ఊహించని ప్రదేశాలలో వెంట్రుకలు పెరగడం ప్రారంభించాయి.. ఈ జుట్టు కారణంగా అతడు చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు. డాక్టర్ చెకప్, కొన్ని రిపోర్టుల తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఆశ్చర్యపరిచాయి.

విషయం ఏమిటి.?

ఆస్ట్రియాలో నివసిస్తున్న 52 ఏళ్ల వ్యక్తి చైన్ స్మోకర్. అతను 1990 నుండి ధూమపానం చేస్తున్నాడు. ఈ ధూమపానం వల్ల అతనికి గొంతు సమస్యలు మొదలయ్యాయి. అతను సరిగ్గా ఏమీ తినలేడు, తాగలేడు. అతని గొంతు కూడా గద్గదంగా మారింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి దగ్గు మొదలైంది. అతనికి 2006 సంవత్సరం నుండి ఈ సమస్యలు మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

చెకప్‌లో ‘వింత’ విషయం వెల్లడైంది..

ఈ వ్యక్తికి సమస్యలు పెరగడంతో అతను 2007లో వైద్యుడి వద్దకు వెళ్లాడు. దగ్గు కారణంగా టెస్టులు చేసిన వైద్యులు.. అతని గొంతులో 5 సెంటీమీటర్ల మేరకు జుట్టు పెరిగిందని గుర్తించారు. వాటి పొడవు 2 అంగుళాల వరకు ఉందన్నారు. అతనికి తన చిన్నతనంలో శ్వాసనాళంలో సర్జరీ జరిగింది.. సరిగ్గా అక్కడే ఈ వెంట్రుకలు పెరిగాయి. అతడు 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నీటిలో మునిగిపోయాడట. బయటకు తీసినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. వైద్యులు ఆపరేషన్ చేసి శ్వాసనాళంలో కోత పెట్టాల్సి వచ్చింది. శ్వాసనాళంలో కోతను మూసివేయడానికి, వైద్యులు అతని చెవి చర్మంలో కొంత భాగాన్ని కత్తిరించి అతని గొంతులో వేసి కుట్లు వేశారు. సాధారణంగా వెంట్రుకలు పెరిగే చెవి భాగం చర్మాన్ని కత్తిరించి గొంతులో వేశారు వైద్యులు. అక్కడ క్రమంగా వెంట్రుకలు పెరుగుతూ వచ్చాయి.

Hair Grown Due To Smoking Habit

చివరకు అతడు 2007లో తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతూ వైద్యుడి వద్దకు వెళ్లగా విషయం తెలిసిన డాక్టర్లు ఆపరేషన్‌ ద్వారా 6 నుంచి 9 వెంట్రుకలను తొలగించారు. అయితే విషయం ఇక్కడితో ముగియలేదు. కొంతకాలం తర్వాత ఈ జుట్టు మళ్లీ పెరిగింది. అలా అతడు తన గొంతులో పెరుగుతున్న జుట్టు కత్తిరించుకోవడానికి ప్రతి సంవత్సరం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. ఈ వెంట్రుకలను శస్త్రచికిత్స ద్వారా మాత్రమే తొలగించారు. ఈ క్రమం 14 ఏళ్ల పాటు కొనసాగింది.

జుట్టుతో ఇబ్బంది పడిన ఈ వ్యక్తి 2022లో ధూమపానం మానేశాడు. ఫలితంగా జుట్టు పెరుగుదల కూడా తగ్గుతూ వచ్చిందని చెప్పాడు. ధూమపానం మానేసిన తర్వాత, వైద్యులు అతని గొంతులో జుట్టు పెరుగుదలకు కారణమయ్యే కణాలను తొలగిస్తూనే ఉన్నారు. కానీ, ఈ ప్రక్రియ ఒక సంవత్సరం తర్వాత, మరో రెండు వెంట్రుకలు మాత్రమే పెరిగాయి. వీటిని తొలగించి మరో శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యక్తి గొంతులో వెంట్రుకలు పెరగలేదని తేల్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..