TTD Darshan: వెంకన్న దర్శన టికెట్లు దొరకలేదని దిగులు చెందుతున్నారా.? ఆర్టీసీ చెప్పిన ఈ శుభవార్త మీ కోసమే..
TTD Darshan: కరోనా సమయంలో తిరుమల శ్రీవారిని దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో...
TTD Darshan: కరోనా సమయంలో తిరుమల శ్రీవారిని దర్శనాన్ని నిలిపివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్లీ భక్తులకు దర్శనం చేసుకునే వెసులుబాటు కల్పించారు. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతూ పోతున్నారు. ఈ క్రమంలోనే రూ. 300ల స్పెషల్ దర్శన టికెట్లను విడుదల చేశారు. అయితే పరిమిత సంఖ్యలో టికెట్లు విడుదల చేస్తుండడంతో.. చాలా తక్కువ సమయంలో టికెట్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో వెంకన్న భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అయితే ఇలా టికెట్ దొరకని వారి కోసం టీటీడీ, ఏపీఎస్ ఆర్టీసీ బంపరాఫర్‌ను ప్రకటించింది.
ఇందులో భాగంగా తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు రోజుకు 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే భక్తులు ప్రయాణ చార్జీలతో పాటు రూ. 300 చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్‌ను పొందవచ్చు. ఇలా టికెట్ పొందిన వారికి ప్రతి రోజూ ఉదయం 11:00 గంటలకు, సాయంత్రం 4:00 గంటలకు ఏడు కొండల వాడి దర్శనం కల్పిస్తారు. తిరుమల బస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవడంలో ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయం చేస్తారు.
ఇదిలా ఉంటే ఏపీఎస్‌ఆర్‌టీసీ వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడిపిస్తోంది. ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ అవకాశంతో బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుంచి తిరుమల వెళ్లే వారికి మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ సదవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: T20 World Cup: ఈ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంది.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
Regina Cassandra: రెజీనా పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకు ఆ అమ్మడు ఏంచేసిందంటే..