AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. ప్రథమ పూజ నిర్వహించిన ఎల్జీ సిన్హా..

హిందువులు తమ జీవితంలో ఒక్కాసారైనా చేయాల్సిన యాత్రగా అమర్ నాథ్ యాత్రను భావిస్తారు. ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శమం ఇచ్చే అమర్ నాథుని యాత్రను చేయడాన్కి పలువురు ఆసక్తిని చూపిస్తారు, ఈ నేపధ్యంలో భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది . ఈ ఏడాది బాబా బర్ఫానీ జూన్ 11న అమర్‌నాథ్ గుహలో మొదటి దర్శనం ఇచ్చారు. బాబా అమర్‌నాథ్‌కు మొదటి పూజ కూడా జరిగింది. అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. ప్రథమ పూజ నిర్వహించిన ఎల్జీ సిన్హా..
Amarnath Yatra 2025
Surya Kala
|

Updated on: Jun 12, 2025 | 6:50 AM

Share

అమర్‌నాథ్ యాత్రను హిందూ మతంలో చాలా పవిత్రంగా , ధర్మబద్ధంగా భావిస్తారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ గుహ శివునికి సంబంధించిన పవిత్ర క్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్ర గుహ శివలింగం సహజంగా మంచుతో ఏర్పడుతుంది. అందుకే దీనిని బాబా బర్ఫానీ (మంచుతో కూడిన శివయ్య) అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు అమర్‌నాథ్ యాత్రకు చేరుకుంటారు. అమర్‌నాథ్ యాత్రికులకు ఈ సంవత్సరం అతిపెద్ద శుభవార్త లభించింది.

ఈ సంవత్సరం 2025లో మంచు లింగ రూపంలో జూన్ 11న అమర్‌నాథ్ పవిత్ర గుహలో తన మొదటి దర్శనం ఇచ్చారు. ఈ సమయంలో బాబా అమర్‌నాథ్‌కు మొదటి పూజ కూడా ఆచారం ప్రకారం జరిగింది. ఈ పూజ , ఆచారాన్ని అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు నిర్వహించింది. అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

2025 సంవత్సరంలో బాబా బర్ఫానీ మొదటి దర్శనం

జ్యేష్ఠ పూర్ణిమ శుభ సందర్భంగా బాబా అమర్‌నాథ్ 2025 సంవత్సరంలో తన మొదటి దర్శనాన్ని పవిత్ర అమర్‌నాథ్ గుహలో ఇచ్చారు. ఈ సందర్భంగా భోలేనాథ్‌ను తగిన ఆచారాలతో పూజించారు. అమర్‌నాథ్ యాత్రికులకు అతిపెద్ద శుభవార్త ఏమిటంటే ఈసారి బాబా బర్ఫానీ తన పూర్తి రూపంలో కనిపించారు.

హర్ హర్ మహాదేవ్!

మొదటి పూజ సమయంలో అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారులు బాబా బర్ఫానీకి నమస్కరించి, ఈ పవిత్ర ఆచారంలో పాల్గొన్నారు. దీనితో ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఆగస్టు రెండవ వారం నాటికి బాబా అమర్‌నాథ్ వద్ద భక్తుల రద్దీ ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఉదయం, సాయంత్రం అమర్‌నాథ్ పవిత్ర గుహలో బాబా బర్ఫానీని పూజలను నిర్వహించారు.

అమర్‌నాథ్ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ సంవత్సరం 2025 లో అమర్‌నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభమైంది. ఈ ఆధ్యాత్మిక యాత్ర 38 రోజుల పాటు కొనసాగుతుంది. అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9 న ముగుస్తుంది. గత సంవత్సరం బాబా బర్ఫానీని సందర్శించడానికి దాదాపు 5 లక్షల మంది భక్తులు వచ్చారు. మూలాల ప్రకారం ఈ సంవత్సరం కూడా దాదాపు 5 లక్షల మంది భక్తులు బాబా బర్ఫానీని సందర్శించడానికి అమర్‌నాథ్ పవిత్ర గుహకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?