AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో ఏ దిశలో దీపం వెలిగిస్తే ఎటువంటి ప్రయోజనం.. ఏ సమయంలో దీపం వెలిగించడం ఉత్తమమో తెలుసా…

హిందూ ధర్మంలో దీపానికి విశిష్ట స్థానం ఉంది. వాస్తు శాస్త్రంలో దీపాన్ని సానుకూల శక్తి , దైవిక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. అయితే దీపం వెలిగించేందుకు కూడా వాస్తు నియమాలున్నాయి. ఇంట్లో సరైన దిశలో దీపం వెలిగిస్తే ఇంటి వాతావరణం శుద్ధి కావడమే కాదు సంపద, దీర్ఘాయువు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక పురోగతి వంటి అనేక ప్రయోజనాలను కూడా పొందుతారు. ప్రతి దిశకు సంబంధించిన శక్తి భిన్నంగా ఉంటుంది. దీపం వెలుగు నిని సక్రియం చేస్తుంది. కనుక ఈ రోజు ఏ దిశలో దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం..

ఇంట్లో ఏ దిశలో దీపం వెలిగిస్తే ఎటువంటి ప్రయోజనం.. ఏ సమయంలో దీపం వెలిగించడం ఉత్తమమో తెలుసా...
Vastu Tips For Lighting Diya
Surya Kala
|

Updated on: May 23, 2025 | 12:44 PM

Share

ఇల్లు అంటే కేవలం ఇటుకలు, రాళ్లతో నిర్మించిన నిర్మాణంగా పరిగణించబడదు. అది మన భావోద్వేగాలు, జ్ఞాపకాలు, శక్తికి కేంద్రం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి దిశకు దాని సొంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది . తదనుగుణంగా మనం కొన్ని చిన్న చర్యలు తీసుకుంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు , శాంతి ఖచ్చితంగా ఉంటాయి. ఈ చర్యలలో ఒకటి ఇంట్లోని వివిధ మూలల్లో దీపాలను వెలిగించడం. ఈ రోజు ఇంట్లో ఏ దిశలో దీపం వెలిగిస్తే ఎటువంటి ప్రయోజనం లభిస్తుందో తెలుసుకుందాం..

తూర్పు, పడమర దిశలలో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

తూర్పు దిశను సూర్యుని స్థానంగా పరిగణిస్తారు. ఈ దిశలో దీపం వెలిగించడం దీర్ఘాయువు పెంచడానికి , అకాల మరణాన్ని నివారించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ దిశ జీవితంలో కొత్త శక్తిని తెస్తుందని భావిస్తారు.

పశ్చిమ దిశలో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. కుటుంబంలో ప్రేమ, ఆనందం , శాంతి ఉంటాయి. ఇది ఇంట్లో కుటుంబ సభ్యుల మనసుకు స్థిరత్వం , సమతుల్యతను కూడా అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉత్తరం, దక్షిణం దిశలలో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుని దిశగా చెబుతారు. ఈ దిశలో దీపం వెలిగించడం ద్వారా, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. డబ్బులకు ఇబ్బంది తొలగిపోతుంది. ఈ దిశ ఇంట్లో సంపద ,శ్రేయస్సును తెస్తుందని భావిస్తారు.

దక్షిణ దిశ పూర్వీకుల దిశ. ఇక్కడ దీపం వెలిగించడం ద్వారా, పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. పితృ దోషం నుంచి విముక్తి పొందవచ్చు. ఇది కుటుంబ శాంతిని కూడా కాపాడుతుంది.

ఈశాన్య దిక్కులో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈశాన్య దిశను అత్యంత పవిత్రమైన దిశగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనిని దేవుని దిశ అని పిలుస్తారు. ఈ దిశలో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. ఈ మూలలో దీపం వెలిగిస్తే, ఇంట్లో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, శ్రేయస్సు వస్తుంది. దైవిక ఆశీస్సులు లభిస్తాయి. అందుకే తరచుగా ఆలయాలు ఈ దిశలో నిర్మించబడతాయి.

ఆగ్నేయ దిక్కులో దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆగ్నేయ మూలను అగ్నిదేవుని స్థానంగా భావిస్తారు. ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆధ్యాత్మిక శాంతి లభిస్తుంది. అగ్ని మూలకానికి సంబంధించిన ఈ దిశ చురుగ్గా ఉంటే కోపం తగ్గిపోయి ఇంట్లో సానుకూలత అలాగే ఉంటుంది. ఈ దిశలో దీపం వెలిగించడం ఆధ్యాత్మిక పురోగతికి, మానసిక సమతుల్యతకు మంచిది.

ఇంట్లో దీపం వెలిగించడానికి సరైన సమయం

వాస్తు శాస్త్రం ప్రకారం దీపం వెలిగించడానికి అత్యంత పవిత్రమైన సమయం సూర్యాస్తమయం తర్వాత, దీనిని ‘ప్రదోష కాలం’ అని కూడా అంటారు. ఈ సమయంలో వెలిగించే దీపం ప్రతికూల శక్తులను తొలగించి ఇంటిని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం కొంత సమయం పాటు ఇంట్లోని వివిధ మూలల్లో దీపం వెలిగించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us