AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: తుది దశలో రామాలయ నిర్మాణం.. నేడు ప్రాంగణానికి రామ దర్బార్ విగ్రహాలు.. ఆలయం ఎప్పుడు పూర్తవుతుందంటే

రామయ్య జన్మ భూమి అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. సప్త మందిర విభాగం , పుష్కరణి నిర్మాణం పూర్తయింది. ప్రధాన ద్వారాల నిర్మాణం జూన్-ఆగస్టు నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అన్ని నిర్మాణ పనులను 2025 ఏడాది చివరి పూర్తి చేయాలని ప్రణాళిక చేశారు.

Ayodhya: తుది దశలో రామాలయ నిర్మాణం.. నేడు ప్రాంగణానికి రామ దర్బార్ విగ్రహాలు.. ఆలయం ఎప్పుడు పూర్తవుతుందంటే
Ayodhya Ram Darbar
Surya Kala
|

Updated on: May 23, 2025 | 12:21 PM

Share

అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ నిర్మాణ పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ఆలయ నిర్మాణం పనులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈరోజు పంచుకున్నారు. రామ దర్బారలో ప్రతిష్టించాల్సిన దైవిక విగ్రహాలు ఈ రోజు ఎప్పుడైనా ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చని చెప్పారు. ఈ విగ్రహాలను మొదటి అంతస్తులో ప్రతిష్టిస్తారు. రామ దర్భార్ లో శ్రీరాముడు, సీత దేవి, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలు కొలువు దీరనున్నారు.

ప్రాణ ప్రతిష్ఠకి సంబంధించిన మతపరమైన ఆచారాలు జూన్ 3 నుంచి ప్రారంభమై జూన్ 5న ముగుస్తాయి. ఈ ప్రత్యేక సందర్భానికి ముందు.. ప్రధాన ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయి. ప్రాకారము, శేషావతార ఆలయం వంటి మిగిలిన నిర్మాణం పనులు సెప్టెంబర్ , అక్టోబర్ మధ్య పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పారు.

సప్త మందిర విభాగం నిర్మాణం పూర్తి

ఇవి కూడా చదవండి

సప్త మందిర విభాగం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అక్కడ ఋషులు, సాధువుల విగ్రహాలను ప్రతిష్టించారు. అంతేకాదు ఈ ఆలయం మధ్యలో ఉన్న పుష్కరణి నిర్మాణం కూడా పూర్తయింది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకారం.. 2020 లో నిర్ణయించిన నిర్మాణ ప్రణాళికలోని అన్ని పనులు 2025 ఏడాది చిరకి పూర్తవుతాయి.

ఆగస్టు చివరి నాటికి 11వ గేట్ నిర్మాణం పూర్తి

ఆలయానికి సంబంధించిన గేట్ల గురించి మాట్లాడుకుంటే.. నాలుగు ప్రధాన గేట్లు నిర్మిస్తున్నారు. వీటిలో ఉత్తర ద్వారం మే నాటికి సిద్ధంగా ఉండాల్సి ఉంది.. అయితే నిర్మాణంలో తలెత్తిన కొన్ని సాంకేతిక అడ్డంకుల కారణంగా.. ఈగేటు ఇప్పుడు జూన్ 30 నాటికి పూర్తవుతుంది. దీని తరువాత గేట్ నంబర్ 11 నిర్మాణం ఆగస్టు చివరి నాటికి పూర్తవుతుంది. గేట్ నంబర్ 3 నిర్మాణం పని ప్రారంభమవుతుంది.

దీనితో పాటు ఆడిటోరియం, అతిథి గృహం, ఇతర సౌకర్యాల నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రామమందిర నిర్మాణం షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది, త్వరలో ఈ దివ్య నివాసం పూర్తవుతుందని చెప్పారు నృపేంద్ర మిశ్రా.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..