What Bats Teach Us: జీవితంలో విలువైన పాఠాలు నేర్పే గబ్బిలం.. వీటిని పాటిస్తే జీవితంలో బాధనేది ఉండదు..
రాత్రుళ్ళు మాత్రమే తిరిగే పక్షి గబ్బిలం. అందుకనే నిశాచర జీవి అని అంటారు. అంతేకాదు పాలిచ్చి తన పిల్లల్ని పెంచుతుంది కనుక గబ్బిలం ఒక క్షీరదం. సుమారు ఆరు కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద నివసిస్తున్న గబ్బిలం నుంచి మనం అనేక జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు అని మీకు తెలుసా..! అవును గబ్బిలాలు మనకు జీవితంలోని అనేక విలువైన పాఠాలను నేర్పుతాయి. అది చీకటిలో దిశను కనుగొనే కళ కావచ్చు లేదా సమిష్టిగా అంటే జట్టుగా చేసే కృషి శక్తి కావచ్చు. ఈరోజు గబ్బిలాల నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం..
Updated on: May 23, 2025 | 10:56 AM

గబ్బిలాల గురించి మనం విన్నప్పుడు .. మన మనస్సులో ఒక భయానకమైన, మర్మమైన చిత్రం ఏర్పడుతుంది. గబ్బిలాలు చీకటికి చిహ్నంగా కూడా భావిస్తారు. ఎవరికైనా చుట్టుపక్కల గబ్బిలం కనిపిస్తే.. దానికి గల కారణం ఏమిటా అంటూ అతను రకరకాల అంచనాలు వేస్తాడు. అంతేకాదు గబ్బిలాలను ప్రతికూలతకు చిహ్నంగా భావిస్తారు. అందుకనే వీటిని ప్రతికూల దృష్టిలో చూస్తారు. అయితే ఈ ఎగిరే క్షీరదం మనకు జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది. ఈ విషయం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మర్మమైన జీవి మానవులకు కూడా గొప్ప గురువు అని మీకు తెలుసా..

చూడకుండానే సరైన దిశను కనుగొంటుంది: గబ్బిలాలు పూర్తి చీకటిలో కూడా ఎగరగలవు. అందుకే ఇవి ఎకోలొకేషన్ అనే టెక్నిక్‌ని ఉపయోగిస్తాయి. అంటే ఇవి విడుదల చేసే ధ్వని తరంగాలు వివిధ వస్తువులను ఢీకొని వాటి వద్దకు తిరిగి వస్తాయి. దీంతో గబ్బిలాలు చీకటిలో కూడా తాము వెళ్ళే మార్గాన్ని సులభంగా అంచనా వేసి ప్రయాణం చేస్తాయి. ప్రతి వ్యక్తి జీవితంలో చాలాసార్లు అలాంటి క్షణాలు వస్తాయి. అప్పుడు అతనికి ఏ దారి కనిపించదు. అటువంటి సమయంలో అతను ఓర్పుగా, తన అంతర్గత తెలివితేటలను ఉపయోగిస్తే.. చిమ్మ చీకటిలో మాత్రమే కాదు కష్టమైన మార్గంలో కూడా సులభంగా వెళ్లేందుకు ఒక మార్గాన్ని కనుగొన వచ్చు,

సమష్టి కృషితో అన్నీ సాధ్యమే:తరచుగా ఒంటరిగా ఎగురుతున్న గబ్బిలం చూస్తాము. అయితే వాస్తవానికి అవి తరచుగా వేల సంఖ్యలో గుంపులుగా నివసిస్తాయి. వీటి పరస్పర సమన్వయం, బంధం చాలా బలంగా ఉంటుంది. ఏదైనా గబ్బిలం ఇబ్బందుల్లో చిక్కుకుంటే దాని స్నేహితులు.. సహాయం చేయడానికి గుంపుగా వచ్చేస్తాయి. అందువల్ల సామూహిక జీవితం, పరస్పర సహకారం ద్వారా, అతిపెద్ద పనులను కూడా సులభంగా సాధించవచ్చని మనిషి తెలుసుకోవాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలి, రోగనిరోధక శక్తి: గబ్బిలాలు అనేక వైరస్‌ల బారిన పడతాయి. అయితే అవి చాలా అరుదుగా వ్యాధులతో బాధపడతాయి. ఎందుకంటే వీటిలో రోగనిరోధక శక్తి చాలా బలంగా, సమతుల్యంగా ఉంటుంది. వీటి జీవనశైలి , ప్రత్యేకమైన జీవ నిర్మాణం వివిధ వ్యాధులతో పోరాడటానికి వీలు కల్పిస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే.. మనిషి సహజ జీవనశైలికి అనుగుణంగా ఉంటే మన శరీరం బలంగా ఉంటుంది. తద్వారా మనం అన్ని రకాల వ్యాధులకు దూరంగా ఉండి, ఒత్తిడి లేని జీవితాన్ని గడపవచ్చు.

శక్తి సామర్థ్యం- అనుకూలత: గబ్బిలాలు తక్కువ శక్తితో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అలాగే అవి వివిధ రకాల వాతావరణానికి అనుగుణంగా జీవిస్తాయి. ఈ లక్షణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే.. తక్కువ వనరులతో మన సామర్థ్యాలను బాగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలో .. ఏదైనా లక్ష్యాన్ని ఎలా సాధించాలో నేర్చుకోవచ్చు.

ప్రకృతితో సామరస్యం: కీటకాలు పండ్లు, పువ్వులతో కూడిన ఆహార గొలుసులో గబ్బిలాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గబ్బిలాలు పరాగసంపర్కం, విత్తనాల వ్యాప్తి వంటి వాటి ద్వారా విధులకు సహాయపడతాయి. ఇది వృక్షసంపద, పర్యావరణ వ్యవస్థను సమతుల్యంగా ఉంచుతుంది. గబ్బిలం ఈ లక్షణం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే.. ప్రకృతితో సామరస్యాన్ని ఏర్పరచుకోవడం, దానిని కాపాడుకోవడం ద్వారా మనం అనేక విపత్తులను నివారించవచ్చు.




