AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glowing Skin Diet: పిగ్మెంటేషన్ పోవాలంటే ఇవి తినండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!

చర్మంపై కనిపించే మచ్చలు, డార్క్ స్పాట్లు, అన్‌ ఈవెన్ టోన్ వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి. ఇవి పిగ్మెంటేషన్ కారణంగా ఏర్పడతాయి. ముఖ్యంగా ధూళి, సూర్యకాంతి, ఒత్తిడి, హార్మోన్ మార్పులు వంటి కారణాల వల్ల చర్మం రంగు మారుతుంది. అయితే రోజూ తీసుకునే ఆహారంతో ఈ సమస్యను సహజంగా తగ్గించుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా కాపాడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Glowing Skin Diet: పిగ్మెంటేషన్ పోవాలంటే ఇవి తినండి.. మంచి రిజల్ట్ ఉంటుంది..!
Glowing Skin
Prashanthi V
|

Updated on: May 23, 2025 | 7:45 PM

Share

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ వంటి పండ్లు చిన్నవైనా.. అందులో పోషకాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. వీటిలో విటమిన్ C పుష్కలంగా ఉండటంతో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపల నుంచి బాగు చేయడంలో సహాయపడతాయి. రెగ్యులర్‌ గా ఈ బెర్రీస్ తీసుకుంటే.. చర్మంపై ఏర్పడే మచ్చలు, డార్క్ టోన్ క్రమంగా తగ్గుతాయి.

పాలకూర, చుక్కకూర, మెంతికూర లాంటి ఆకుకూరల్లో విటమిన్ A, C, E ఎక్కువగా ఉంటాయి. ఇవి కేవలం ఆరోగ్యానికే కాదు.. చర్మాన్ని కూడా మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. రోజూ ఆకుకూరలు తింటే చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీని ద్వారా పిగ్మెంటేషన్ సమస్య సహజంగా తగ్గే అవకాశం ఉంటుంది.

నిమ్మకాయ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లలో ఉండే విటమిన్ C చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేందుకు సహాయపడుతుంది. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మాన్ని బలపరచడమే కాదు.. పిగ్మెంటేషన్ తగ్గించడంలోనూ సహకరిస్తాయి.

టమాటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సూర్యకాంతి వల్ల చర్మానికి కలిగే హానిని తగ్గించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ టమాటాలు తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చర్మంపై నిగారింపు పెరుగుతుంది.

బాదం, వాల్‌ నట్ వంటి డ్రైఫ్రూట్స్‌ లో విటమిన్ E అధికంగా లభిస్తుంది. ఇది చర్మానికి తేమను అందిస్తూ.. మృదుత్వాన్ని ఇస్తుంది. ఇందులోని ఒమేగా 3 కొవ్వులు చర్మాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని రోజూ కొద్దిగా తింటే పిగ్మెంటేషన్ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది.

సాల్మన్, మాకెరెల్, సార్డిన్స్ లాంటి చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాల్లో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతాయి. ఇవి క్రమం తప్పకుండా ఆహారంలో భాగమైతే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E, విటమిన్ C వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ కణాల రీపేర్‌ కు అవసరమైనవి. అవకాడో తినడం ద్వారా చర్మం తేమను నిలుపుకుంటుంది. అదే సమయంలో పిగ్మెంటేషన్ తగ్గే అవకాశమూ ఉంది.

గ్రీన్ టీలో కెటచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ అనే హానికరమైన మూలకాల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ ఒక గ్లాస్ గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. మచ్చలు తగ్గుతాయి.

స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోకి వెళ్ళాక విటమిన్ A గా మారుతుంది. ఇది చర్మం రిజనరేషన్‌ కు సహాయపడుతుంది. పాత చర్మ కణాల స్థానంలో కొత్త కణాలు రావడానికి తోడ్పడుతుంది. ఫలితంగా పిగ్మెంటేషన్ తగ్గే అవకాశముంది.

చర్మ సమస్యలకు ఔషధాలు, క్రీమ్‌లు మాత్రమే పరిష్కారం కాదు. ఆహారం ద్వారా చర్మాన్ని లోపల నుంచి బాగు చేయవచ్చు. పైన చెప్పిన ఆహారాలను రోజువారీ జీవనశైలిలో చేర్చడం ద్వారా చర్మం కాంతివంతంగా మారడమే కాదు.. పిగ్మెంటేషన్ లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)