AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఎముకలు బలహీనంగా ఉన్నాయా.. తినే ఆహారంలో ఈ సీడ్స్ ను చేర్చుకోండి..

మన శరీర ఆకృతిని, సమతుల్యతను కాపాడుకోవడానికి ఎముకలు సహాయపడతాయి. అయితే సరైన ఆహారం, కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఎములు బలంగా ఉండాలంటే తినే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఈ రోజు ఎముకల బలం కోసం ఏ విత్తనాలు తినాలో.. తెలుసుకుందాం.

Health Tips: ఎముకలు బలహీనంగా ఉన్నాయా.. తినే ఆహారంలో ఈ సీడ్స్ ను చేర్చుకోండి..
Seeds For Better Bone Health
Surya Kala
|

Updated on: May 23, 2025 | 11:12 AM

Share

శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. దీనికి ప్రధాన కారణాలు చెడు జీవనశైలి , చెడు ఆహారపు అలవాట్లు. శరీరంలో కాల్షియం లేకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అయితే ఇలా నిరంతరం జరిగితే శరీరం అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు గురవుతుంది. అటువంటి పరిస్థితిలో బలమైన ఎముకల కోసం ఆహారాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. హెల్త్‌లైన్ ప్రకారం ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే శరీరంలో సరైన కాల్షియం స్థాయిలు ఉండటం చాలా ముఖ్యం. నిజానికి శరీరానికి బలాన్ని ఇచ్చే కొన్ని విత్తనాలు ఉన్నాయి. వీటిని తినే ఆహారంలో చేర్చుకోవాలి.

విత్తనాలలో అధిక మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేయడానికి సహాయపడతాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కాల్షియం లోపం తొలగిపోతుంది. ఎముకలు బలోపేతం కావడానికి కూడా సహాయపడతాయి. కనుక ఎవరివైనా ఎముకలు బలహీనంగా మారితే.. ఈ 5 విత్తనాలను మీ ఆహారంలో చేర్చుకోండి

చియా సీడ్స్ చియా గింజలు మీ చర్మానికి, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. చియా విత్తనాలలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

నువ్వులు నువ్వులు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కాల్షియంను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిని సలాడ్ మీద చల్లుకోవడం ద్వారా లేదా నువ్వుల లడ్డులు తయారు చేయడం ద్వారా క్రమం తప్పకుండా తినవచ్చు.

అవిసె గింజలు అవిసె గింజలు కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముక సాంద్రతను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిని లడ్డులు తయారు చేసి తినవచ్చు.

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎముకల బలహీనత సమస్య నుంచి బయటపడటానికి పొద్దుతిరుగుడు విత్తనాలను తినవచ్చు. ఇందులో మాంగనీస్, కాల్షియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. వీటిని మొలకలతో కలిపి లేదా చిరుతిండిగా కూడా తినే ఆహారంలో చేర్చుకోవచ్చు.

గసగసాలు గసగసాలు లేదా ఖాస్ ఖాస్ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఇందులో మాంగనీస్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకల బలహీనతను తగ్గిస్తాయి. వీటిని షర్బత్ తయారు చేసుకుని వేసవిలో కూడా తాగవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..