AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu tips: చీపురు, తుడుపుకర్రను ఇంట్లో ఈ దిశలో పెట్టండి.. లక్ష్మీ దేవి అనుగ్రహం మీ సొంతం..

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచే ప్రతి వస్తువుకు స్థలం నిర్ణయించబడుతుంది. వస్తువులను ఉంచడానికి సరైన దిశ ఉంది. ఇది మన జీవితాలపై మంచి , చెడు ప్రభావాలను చూపుతుంది. ఇంటికి నిజమైన శ్రేయస్సును తెస్తుంది. అటువంటి పరిస్థితిలో మనం తెలిసి లేదా తెలియకుండానే విస్మరించే కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇంట్లో రోజూ ఉపయోగించే చీపురు. కనుక ఈ రోజు మనం చీపురికి సంబంధించిన వాస్తు నియమాలను గురించి తెలుసుకుందాం,,

Vastu tips: చీపురు, తుడుపుకర్రను ఇంట్లో ఈ దిశలో పెట్టండి.. లక్ష్మీ దేవి అనుగ్రహం మీ సొంతం..
Vastu Tips
Surya Kala
|

Updated on: May 23, 2025 | 9:33 AM

Share

జ్యోతిషశాస్త్రంలో చీపురు లక్ష్మీ దేవితో ముడిపడి ఉంది. వాస్తు శాస్త్రంలో కూడా దీని నిర్వహణ , ఉపయోగం కోసం నియమాలు ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. చీపురు ని ఉపయోగించి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లోని చెత్తను మాత్రమే తీసివేయడమే కాదు పేదరికాన్ని కూడా తొలగించవచ్చు. వాస్తు ప్రకారం ఇంట్లో చీపురు ఉంచుకునేటప్పుడు అనేక ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. ఇది సాధారణ విషయంగా అనిపించవచ్చు.. కానీ ఇంటి లక్ష్మికి అంటే సంపద మొదలైన వాటికి కూడా సంబంధించినదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. చీపురును సంపద దేవత అయిన లక్ష్మీ దేవి చిహ్నంగా భావిస్తారు.

మనం వీటిని ప్రతిరోజూ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాము,.. వాటిని ఉంచడానికి సరైన స్థలాన్ని మనం ఎంచుకోము. ఇలా చేయడం వలన మనకు తెలియకుండానే ఇంట్లో పేదరికానికి, సమస్యలకు చోటు కల్పిస్తాము. కనుక ఇంట్లో చీపురు, తుడుపుకర్రను ఎక్కడ ? ఎలా ఉంచాలి? చీపురుకు సంబంధించిన చేయకూడని తప్పులు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం.

చీపురు తుడుపుకర్ర ఎక్కడ ఉంచాలి

ఇవి కూడా చదవండి

వాస్తు శాస్త్రం ప్రకారం, చీపురు, తుడుపుకర్రను ఇంటికి వాయువ్యం లేదా పశ్చిమ దిశలో ఉంచాలి.

వాస్తు ప్రకారం చీపురును దక్షిణ దిశలో మాత్రమే ఉంచండి.

చీపురును నేరుగా కనిపించే ప్రదేశంలో ఉంచకూడదు. దానిని ప్రజల దృష్టికి దూరంగా ఉంచాలి.

చీపురునునిలబెట్టి కాకుండా పడుకొబెట్టి ఉంచాలి. ఇంట్లో చీపురును నిలబెట్టుకోవడం శుభప్రదం కాదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

పొరపాటున కూడా చీపురు, తుడుపుకర్రను ఎక్కడ ఉంచకూడదంటే

చీపురు, తుడుపుకర్రను ఇంట్లో ఈశాన్య లేదా ఆగ్నేయ మూలలో ఎప్పుడూ ఉంచకూడదు.

చీపురును ఈశాన్య దిశలో ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడుతుందని నమ్ముతారు.

వీటిని పూజా స్థలం దగ్గర వంటగదిలో లేదా పడకగదిలో ఉంచడం మంచిది కాదు.

ఇంట్లో ఎప్పుడూ చీపురు మీ కాళ్ళ కిందకు రానివ్వకండి. కళ్ళతో చీపురుని తోక్కకండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది.

చీపురు మార్చే నియమం మీరు చీపురు మార్చబోతున్నట్లయితే, శనివారం దీనికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. చీపురును ఎల్లప్పుడూ కృష్ణ పక్షంలో కొనుగోలు చేయాలి.

ఎప్పుడూ అగౌరవపరచవద్దు

చీపురును ఎప్పుడూ తన్నకండి లేదా గట్టిగా విసరకండి. సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ ఊడ్చకూడదు. ఇలా చేయడం వలన ధన నష్టానికి దారితీస్తుంది.

విరిగిన, పూర్తిగా అరిగిన చీపురును ఉపయోగించవద్దు

వాస్తు ప్రకారం, విరిగిన లేదా పూర్తిగా అరిగిపోయిన చీపురును ఎప్పుడూ ఉపయోగించకూడదు.

పాత చీపురును ఎప్పుడు తీసివేయాలి

పాత చీపురు ఇంట్లోకి ప్రతికూలతను తెస్తుంది. శనివారం లేదా అమావాస్య నాడు ఇంటి నుంచి దానిని తొలగించాలి. ఇంట్లో నుంచి పాత చీపురును తీసివేయడం వల్ల ఇంట్లోని పేదరికం తొలగిపోయి ఇంట్లో సానుకూలత పెరుగుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us