AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Temple: ఈ అమ్మవారి ఆలయంలో భార్యాభర్తలు కలిసి పూజలు చేయరు? ఎందుకంటే..

భారతదేశంలో వివిధ రకాల విశ్వాసాలు, నమ్మకాలు అనేక దేవుళ్ళు లేదా దేవతల దేవాలయాలతో ముడిపడి ఉన్నాయి. అయితే కొన్ని దేవాలయాలు వాటి ప్రత్యేకమైన ఆచారాలు, రహస్యాల కారణంగా భక్తులలో ప్రత్యేక ఆకర్షణకు కేంద్రంగా ఉన్నాయి. అటువంటి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఉంది. ఈ ఆలయంలో భార్యాభర్తలు కలిసి పూజలు చేసుకోలేరు. ఈ సంప్రదాయం వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే..

Unique Temple: ఈ అమ్మవారి ఆలయంలో భార్యాభర్తలు కలిసి పూజలు చేయరు? ఎందుకంటే..
Shrai Koti Mata Temple
Surya Kala
|

Updated on: May 23, 2025 | 10:21 AM

Share

భారతదేశం అడుగడుగునా ప్రత్యేకమైన ఆచారాలు , సంప్రదాయాలున్న దేశం. ఇక్కడ అనేక దేవాలయాలు ఉన్నాయి. అవి వాటి ప్రత్యేకమైన నమ్మకాలు, ఆరాధన పద్ధతులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లాలోని రాంపూర్ తహసీల్ లో ఉన్న శ్రీ కోటి మాత ఆలయం కూడా అటువంటి ప్రత్యేకమైన ఆలయమే. ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే భార్యాభర్తలు ఇక్కడ కలిసి పూజలు చేయలేరు. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు.. కానీ ప్రదేశంలో, భార్యాభర్తలతో కలిసి పూజలు చేయడంపై కఠినమైన నిషేధం ఉంది. ఇది మాత్రమే కాదు జంట అక్కడ కలిసి పూజలు చేస్తే, వారికి ఏదో చెడు జరుగుతుందని నమ్ముతారు.

జంటలు కలిసి ఎందుకు సందర్శించకూడదు?

హిమాచల్ ప్రదేశ్‌లోని శ్రీ కోటి మాత పేరుతో ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం శివపార్వతులు తమ ఇద్దరు కుమారులైన గణేశుడు, కార్తికేయుడిని విశ్వాన్ని చుట్టి రావాలని కోరారు. కార్తికేయుడు తన వాహనంమీద కుర్చుని విశ్వ పర్యటనకు వెళ్ళాడు. అయితే గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత.. విశ్వం తల్లిదండ్రుల పాదాల వద్ద ఉందని చెప్పాడు. విఘ్నాదిపత్యంతో పాటు పెళ్లి కూడా చేసుకున్నాడు.

ఈ ప్రత్యేకమైన సంప్రదాయం వెనుక ఉన్న కథ కార్తికేయుడికి సంబంధించినది. పురాణాల ప్రకారం శివపార్వతిల తనయుడు కార్తికేయుడు వివాహం చేసుకోకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాడు. కార్తికేయ నిర్ణయం గురించి తల్లి పార్వతికి తన కొడుకు నిర్ణయంతో కలత చెంది. ఈ ప్రదేశంలో తనను సందర్శించడానికి వచ్చే భార్యాభర్తలు ఒకరినొకరు విడిపోతారని శపించింది. ఈ శాపం కారణంగా, భార్యాభర్తలు ఈ ఆలయంలో కలిసి పూజలు చేయరని నమ్ముతారు. అయితే ఈ నియమం ఉన్నప్పటికీ, వివాహిత జంటలు దూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తారు. కానీ వారు విడి విడిగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితం సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటారు. నేటికీ భార్యాభర్తలు ఇక్కడ కలిసి పూజలు చేయరు. అయితే శ్రాయ్ కోటి ద్వారం వద్ద ప్రతిష్టించబదిన గణపతి తన భార్యతో కలిసి ఉన్న విగ్రహాలు నేటికీ భక్తులకు దర్శనం ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

ఆలయ విశేషాలు

ఈ ఆలయం దుర్గాదేవి 51 శక్తిపీఠాలకు ఎటువంటి సంబంధం లేదు. అయినా స్థానిక భక్తులలో ఈ ఆలయానికి ఉన్న గుర్తింపు ఏ శక్తిపీఠం కంటే తక్కువ కాదు. నవరాత్రి రోజులలో భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు. అయితే భార్తభార్తలు విడిగా దర్శనం చేసుకునే సంప్రదాయాన్ని ఇప్పటికీ ఖచ్చితంగా పాటిస్తారు. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా .. ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంది, ఇది భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు