Vastu Tips: మీరు టీవీ, మొబైల్ చూస్తూ తింటున్నారా..? అయితే ఇది మీకోసమే..!
మనం రోజూ భోజనం చేస్తాం. కానీ కొన్ని సార్లు అలవాట్ల వల్ల ముఖ్యమైన విషయాలు మర్చిపోతాం. వాస్తు శాస్త్రం ప్రకారం తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. వీటిని పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇంటికి శుభశక్తి కూడా వస్తుంది. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ కూర్చోవడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతారు. దక్షిణం దిశ యమధర్మరాజుకు సంబంధించింది. ఆ దిశలో తింటే శరీరానికి చెడు శక్తులు చేరవచ్చు. దీని ప్రభావంగా అనారోగ్యం, డబ్బు సమస్యలు, మానసిక ఒత్తిడి రావొచ్చు.
మీరు టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ టేబుల్ ఖాళీగా ఉండకూడదు. కొన్ని తాజా పండ్లు, మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంచడం మంచిది. ఖాళీ టేబుల్ ఇంట్లో సంపదను తగ్గిస్తుందని వాస్తు చెబుతుంది. కనీసం ఒక మంచి వస్తువు అయినా అక్కడ ఉంచడం మంచిది.
ఈ రోజుల్లో చాలా మంది బెడ్ పైనే భోజనం చేస్తుంటారు. కానీ ఇది వాస్తు ప్రకారం మంచిది కాదు. ఎందుకంటే అలా తింటే ఇంట్లో శుభశక్తులు బలహీనపడతాయి. సంపదలో లోటు ఏర్పడుతుందని నమ్మకం. కాబట్టి వీలైనంత వరకు మంచంపై తినడం మానుకోవాలి.
పలుచగా మిగిలిపోయిన ఉప్పును చెత్తలో వేయడం చాలా మందికి అలవాటు. కానీ వాస్తు ప్రకారం ఉప్పు లక్ష్మీదేవికి సూచిక. దాన్ని ఇలా విసిరేస్తే ఇంట్లో ఇబ్బందులు, సమస్యలు ఎక్కువవుతాయని చెబుతారు. మిగిలిన ఉప్పులో కొద్దిగా నీరు కలిపి డ్రైన్లో వదిలేయడం ఉత్తమం.
రాత్రి భోజనం తర్వాత పాత్రలను అలాగే వదిలేసి నిద్రపోవడం చాలా మందికి అలవాటు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంటి శాంతికి ఆటంకం. అలాగే ఇది కుటుంబసభ్యుల మధ్య బంధాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థికంగా కూడా చెడు ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతారు. కాబట్టి నిద్రించే ముందు పాత్రలను శుభ్రం చేయడం మంచిది.
ఆహారం తినే సమయంలో టీవీ చూడడం, మొబైల్ వాడటం వల్ల మన దృష్టి భోజనంపై ఉండదు. ఇది శారీరక ఆరోగ్యానికే కాదు.. ఇంట్లోని శుభ వాతావరణానికి కూడా ప్రతికూలం. వాస్తు ప్రకారం ఇది తినే ఆహారంలో ఉన్న శక్తిని తగ్గిస్తుంది. శరీరానికి తగిన లాభాలు అందకుండా చేస్తుంది. అంతేకాక కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని తగ్గించే అవకాశం ఉంది.
ఆహారం మన శరీరానికి మాత్రమే కాదు.. ఇంటి శుభ శక్తికీ ప్రధానం. అందుకే తినే విధానం, దిశ, అలవాట్లు.. ఇవన్నీ వాస్తు ప్రకారం సరిగ్గా ఉండేలా చూసుకుంటే శుభ ఫలితాలు వస్తాయి.