- Telugu News Photo Gallery Just include star fruit in your diet, you'll be in control of your health problems
Star Fruit Benefits: మీ ఆహారంలో స్టార్ ఫ్రూట్ ఉంటే చాలు.. అనారోగ్య సమస్యలకు చెక్..
పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది. నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉండడమే కాదు బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి. ఈ స్టార్ ప్రూట్ లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Jun 12, 2025 | 9:45 PM

వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఈ పండు తింటే మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు వారికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలోని ఫైబర్ ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

ఈ పండులో పుష్కలంగా కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ చర్యను నిరోధిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు తరచుగా స్టార్‌ఫ్రూట్ తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సితో పాటు, యాంటీఆక్సిడెంట్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ కాంబినేషన్ రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. ఈ పండులో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆనారోగ్యాలు రాకుండా రక్షిస్తాయి.

గుండెకు మంచిది: గుండె సమస్యతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. సోడియం, పొటాషియం, ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న స్టార్‌ఫ్రూట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

Star Fruit




