Akshaya Tritiya 2023: అక్షయ తృతీయన ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సుఖ సంతోషాలు మీ సొంతం..

అక్షయ తృతీయ రోజున ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవితో పాటు శ్రీ విష్ణువును ఆరాధిస్తే సాధకుడికి అనంతమైన ఫలాలు లభిస్తాయని... సుఖ సంతోషాలతో పాటు..  అదృష్టం ఎల్లప్పుడూ అతని ఇంట్లో ఉంటాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే బంగారం తో పాటు మరికొన్ని శుభప్రదమైన మరికొన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చని మీకు తెలుసా..

Akshaya Tritiya 2023: అక్షయ తృతీయన ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సుఖ సంతోషాలు మీ సొంతం..
Akshaya Tritiya
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 18, 2023 | 1:57 PM

అక్షయ తృతీయకు హిందూమతంలో సుఖ, సంపద, వైభవాన్ని ఇచ్చే రోజు అని భావిస్తారు. అక్షయ తృతీయ రోజున చేసే పూజ, జపం, తపస్సు, చర్యలు మొదలైన వాటి ద్వారా లభించే పుణ్యాలు ఎప్పటికీ నశించవని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవితో పాటు శ్రీ విష్ణువును ఆరాధిస్తే సాధకుడికి అనంతమైన ఫలాలు లభిస్తాయని… సుఖ సంతోషాలతో పాటు..  అదృష్టం ఎల్లప్పుడూ అతని ఇంట్లో ఉంటాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే బంగారం తో పాటు మరికొన్ని శుభప్రదమైన మరికొన్ని వస్తువులు కొనుగోలు చేయవచ్చని మీకు తెలుసా.. ఈ రోజు అక్షయ తృతీయ రోజున కొనే ఇతర వస్తువులు ఏమిటో తెలుసుకుందాం..

1. శ్రీ యంత్రం సనాతన సంప్రదాయంలో శ్రీ యంత్రాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. నియమ నిబంధనల ప్రకారం శ్రీ యంత్రాన్ని పూజించే ఇంట్లో ఆ ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిల్వ ఉంటుందని విశ్వాసం. ఇంటిలోని పూజా స్థలంలో శ్రీయంత్రం లేకపోతే, ఈ సంవత్సరం శుభ, ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని తెచ్చి ప్రతిరోజూ పూజించండి.

2. పసుపు గవ్వలు సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవి పూజలో సమర్పించే పసుపు గవ్వలు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే బంగారం లాంటి శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

3. బార్లీ సనాతన సంప్రదాయంలో చేసే పూజలో బార్లీ చాలా ముఖ్యమైనది. అక్షయ తృతీయ రోజున బార్లీని కొని ఇంటికి తెచ్చి, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆర్థిక సమస్యలు త్వరలో తొలగిపోతాయని హిందూ విశ్వాసం. అక్షయ తృతీయ రోజున, ఏడాది పొడవునా బార్లీని నైవేద్యంగా పెట్టే వ్యక్తిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.

4. తులసి సనాతన సంప్రదాయంలో తులసిని విష్ణుప్రియ అని పిలుస్తారు. తులసి ఉన్న ఇంట్లో అన్ని రకాల దోషాలు పోయి, లక్ష్మీ, నారాయణుల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ అక్షయ తృతీయ నాడు మీ ఇంటికి తులసి మొక్కను తీసుకురండి, ఆనందం, అదృష్టాన్ని మీ ఇంట్లో కొలువుంటుంది. కావాలంటే జమ్మి మొక్కను కూడా ఇంట్లో నాటుకోవచ్చు.

5. శంఖం సనాతన హిందూ సంప్రదాయంలో, శంఖం లక్ష్మీదేవికి సోదరుడిగా పరిగణించబడుతున్నాడు. ఎందుకంటే శంఖం సముద్ర మథనం సమయంలో కూడా ఉద్భవించింది. అటువంటి పరిస్థితిలో సంపదను కోరుకునే వ్యక్తి అక్షయ తృతీయ రోజున తన ఇంటికి శంఖాన్ని కొని తీసుకురావాలి. ప్రతిరోజూ శంఖాన్ని ఊదడం వల్ల ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి అంతా వెళ్లిపోతుందని, లక్ష్మి దేవి ఎప్పుడూ అక్కడ నివసిస్తుందని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)